Double Murder Case on Old Couple Murder Suspect Hyderabad :పీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలానికి చెందిన చెంచు శైలజారెడ్డి(42) భర్త కృష్ణారెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి 2011లో రంగారెడ్డి జిల్లా కందుకూరుకు వచ్చి దాసర్లపల్లిలోని అరుణ ఫాం హౌస్‌లో పనికి కుదిరారు. 2023 మార్చి 3న కృష్ణారెడ్డి, పిల్లలు బయటకు వెళ్లగా ఇంట్లో శైలజారెడ్డి ఒక్కరే ఉన్నారు. అప్పటికే ఆమెపై కన్నేసిన దాసర్లపల్లికి చెందిన ఉప్పుల శివకుమార్ ఫాంహౌస్‌కు వెళ్లి ఆమెను బలవంతం చేయాబోయాడు. ఈ క్రమంలో శైలజా ఎదురు తిరిగింది. దీంతో అతడు కత్తితో ఆ మహిళను నరికి చంపాడు.
Police Solved the Case of Brutal Murder of an Elderly Couple : తర్వాత పక్కనే మద్యం సీసా కనిపించగా తాగేందుకు ప్రయత్నించాడు. సీసా చేజారి కింద పడి పగిలిపోయింది. దానిపై నిందితుడి వేలిముద్రలు పడ్డాయి. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. వేలిముద్రలు మినహా ఘటనా స్థలిలో ఎలాంటి ఆధారాలు లభ్యమవ్వలేదు. ఎప్పటికైనా నిందితుడు చిక్కుతాడనే ఉద్దేశంతో పోలీసులు మద్యం సీసా మీద వేలిముద్రలు భద్రపరిచారు. తాజాగా కొత్తగూడ మామిడితోటలో వృద్ధ దంపతుల హత్య కేసులో శివకుమార్ నిందితుడని పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్టు చేశారు. ఇక్కడ సేకరించిన వేలిముద్రల్ని శైలజారెడ్డి హత్య కేసులో నమోదైన వాటిని రెండింటినీ రాచకొండ ఫింగర్ ప్రింట్ యూనిట్‌తో పోల్చగా సరిపోలాయి. దీంతో పోలీసులు రెండు కేసుల్లోనూ శివకుమార్‌ను నిందితుడిగా చేర్చారు.