Donors are Donating Heavily to CM Relief Fund : వరద ప్రభావిత బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో పలువురు దాతలు విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, గృహిణులు తమ వంతుగా బాధితుల కోసం విరాళాలను అందిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి దాతలు విరాళాలు అందిస్తున్నారు. విరాళాలు అందించిన వారిలో, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఒకరోజు మూలవేతనం రూ.8.10 కోట్లు, ఏ.శివకుమార్ రెడ్డి రూ.1.50 కోట్లు, ఈ. చంద్రారెడ్డి రూ.50 లక్షలు, విశ్వభారతి ఇనిస్టిట్యూషన్స్ వైస్ వుడ్స్ రూ.30 లక్షలు(గుడివాడ), ఎన్టీఆర్ వెటర్నరీ కాలనీస్ డెవలప్ మెంట్ అసోసియేషన్ రూ.25 లక్షలు, బృందావన్ మీటింగ్ ఏజన్సీస్ రూ.25 లక్షలు, శంకర్ రావు రూ.25 లక్షలు, మదన్ మోహన్ రావు రూ.25 లక్షలు, కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ రూ.10 లక్షలు, అంబికా అగర్ బత్తిస్ ఆరోమా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అంబికా కృష్ణ రూ. 5 లక్షలు అందిచారు.
వరద బాధితులకు అండగా టాలీవుడ్ హీరోలు - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States
అనుమోలు జగన్ మోహన్ రావు రూ. 5 లక్షలు, అనుమోలు అనార్కలి 5 లక్షలు, బుద్ధా వెంకన్న 5 లక్షలు, రమేష్ హాస్పిటల్స్ 3 లక్షలు, అమరావతి కార్ మెకానిక్స్ అసోసియేషన్స్ 2 లక్షలు, పి.సుధాకర్ 1,14,000, విశ్రాంత ఉపాధ్యాయుడు కావూరి దుర్గా మల్లేశ్వర ప్రసాద్ 1,00,116, శ్రీ విజయదుర్గ పీఠం 1 లక్ష(అంబేద్కర్ కోనసీమ జిల్లా), మందలపు జయలక్ష్మి 1 లక్ష, ఎమ్. గ్రీష్మ 1 లక్ష, పీఎస్. కమలాదేవి 1 లక్ష, హెచ్.ఎం. ప్రమీళా రాణి 1 లక్ష, పరుచూరి ప్రమీళా రాణి 1 లక్ష, ఎం.వి.జి.కుమార్ 1 లక్ష, పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి 51 వేలు, ఎం.కృష్ణ 50 వేలు, వై. ఉమామహేశ్వరరావు 50,000, వి.కస్తూరీబాయి 50 వేలు, గోవర్థన, గౌతమి, చలపతి 50,000, పొలసాని కృష్ణారావు 10,116, డాక్టర్ భార్గవ్ 60వేల రూపాయల విరాళం అందించారు. వీరందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
వరద బాధితులకు నటుడు వరుణ్‌తేజ్ రూ.15 లక్షల విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.5 లక్షలు ప్రకటించిన వరుణ్‌తేజ్, ఏపీ పంచాయతీరాజ్ శాఖకు రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. విజయవాడ ఎం.పి.కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరద బాధితులకు పశ్చిమ నియోజకవర్గం టీఎన్‌టీయూసి అధ్యక్షులు కాండ్రేగుల రవీంద్ర, క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి జాయింట్ కన్వీనర్ బుద్దరాజుమ శివాజీలు 5లక్షల రూపాయల చెక్‌ను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు అందించారు.
పవర్‌స్టార్ గొప్ప మనసు - వరద బాధితులకు రూ.6 కోట్లు విరాళం - Pawan Dontation to Flood Victims
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు విజయవాడను వరద బాధితుల్ని ఆదుకోవడానికి దాతలు ముందుకువస్తున్నారు. వరదలతో అతలాకుతలమైన బాధితుల్ని ఆదుకోవడానికి ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ భారత్ బయోటెక్ సంస్థ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమచేసినట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల వెల్లడించారు. ఏపీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కార్మిక పరిషత్ తమ వంతుగా ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు ఎస్‌వీ శేషగిరిరావు తెలిపారు.
వరదల్లో చిక్కుకున్న ప్రజల సహాయార్థం 25లక్షల విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.జయచంద్రనాయుడు సీఎం చంద్రబాబుకు సంబంధిత చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు రోగాలు ప్రబలకుండా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడానికి ఐఎంఏ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీ ఫౌల్ట్రీ ఫామ్ రైతులు వరద బాధితుల సహాయార్థం 25లక్షలు విరాళం ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు బాసటగా నిలవడానికి ఎల్‌వీఆర్ అండ్ సన్స్, రీడింగ్ రూం క్లబ్ 25లక్షల విరాళం ఇచ్చారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఆ క్లబ్ గౌరవాధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్, అధ్యక్షుడు మైనేని బ్రహ్మేశ్వరరావులు ఈ మేరకు సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేశారు.
వరద బాధితులకు చేయూత - ఏపీ సీఎం సహాయనిధికి భారత్ బయోటెక్ రూ.కోటి విరాళం
వరద బాధితుల సహాయార్థం పయనీర్ సంస్థ 25లక్షల సాయాన్ని ప్రకటించింది. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ, దాని అనుబంధ సంస్థ తరఫున 25లక్షలు విరాళం ప్రకటించారు. వరదలో చిక్కుకున్న బాధితుల్ని ఆదుకోవడానికి గుంటూరు క్లబ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పాతూరి కిరణ్, కార్యదర్శి నల్లమోతు సాంబశివరావు 10లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. మంగళగిరిలోని మిడ్‌వాలీ సిటీ గృహసముదాయం నివాసితులు వరద బాధితులకు ఆహారం సమకూర్చడానికి తాము స్వచ్ఛందంగా సమకూర్చిన 10.77లక్షల చెక్కును అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అందజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలకు గుంటూరు లోటస్ ఇన్‌ఫ్రా ప్రతినిధులు కె.వంశీకృష్ణ, రాంబాబు, చిన్నఅంకారావు, శ్రీనివాసరావులు మంత్రి లోకేశ్‌కు పది లక్షల విరాళం చెక్కును అందజేశారు.
ఏలూరుకు చెందిన ప్రవాసాంధ్రులు మేకా వినయ్‌బాబు, సామినేని పవన్‌కుమార్‌లు పది లక్షల విరాళం ఇచ్చారు. సిటీ కేబుల్ ఎండీ సాయి 5 లక్షల చెక్కును లోకేశ్‌కు అందజేశారు. వరద బాధితుల్ని ఆదుకోవడానికి మొగల్రాజపురానికి చెందిన సిద్ధార్థ వాకర్స్ క్లబ్ తమవంతుగా 5లక్షల విరాళం ఇచ్చింది. సంబంధిత చెక్కును అధ్యక్షుడు కె.జనార్ధనరావుతో కలిసి కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. పుట్టపర్తికి చెందిన శ్రీసత్యసాయి సేవాసంస్థ సభ్యులు వరద ముంపు ప్రాంతాల్లో సుమారు 50వేల మంది బాధితులకు ఆహారం, నీరు, ఇతర తినుబండారాలను పంపిణీ చేశారు. విజయవాడలోని వైఎస్సార్, జక్కంపూడి కాలనీల్లో వరదలో చిక్కుకున్న బాధితులకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) తరఫున సుమారు 20వేల మందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పదివేల పాల పొట్లాలు, 30వేల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.
"మేమున్నాం" అంటూ విరాళాల వెల్లువ - వారందరికీ లోకేశ్ కృతజ్ఞతలు - Donations to help flood victims
బాధితులకు టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ లక్ష నీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు, ప్రభుత్వ యంత్రాంగమంతా అండగా ఉంటుందని వారికి భారోసానిచ్చారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కుమారుడు జగదీశ్ వరద బాధితుల కోసం తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 21వేలు విరాళంగా ఇచ్చాడు. కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ సహకార సంస్థ 25లక్షలు, చుక్కపల్లి రమేశ్ 25లక్షలు, తెనాలి డబుల్ హార్స్ సంస్థ 10లక్షలు, ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం 5లక్షలు, చిలకమర్రి శ్రీనివాసాచార్యులు 1.50లక్షలు, షేక్ బాజీ 50వేలు, సి.జగదీష్‌సాయి రూ.21వేలు అందించారు. వరద బాధితులకు సింథైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.10 లక్షల విరాళం ఇచ్చింది.
వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసల రెడ్డి సీఎం సహాయ నిధికి విరాళం అందజేశారు. తన సంస్థల ద్వారా కోటి 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కును అందజేశారు. ఇప్పటికే జిల్లా నుంచి చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు కలెక్టర్ అందజేశారు. దీంతో మొత్తంగా తన వంతుగా కోటి 60 లక్షల రూపాయలు సహాయం ప్రకటించినట్టయ్యింది.
వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? - బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇవే - Donate For Flood Victims