ఖాళీగా దర్శనమిస్తున్న జిల్లా ఉపాధి కార్యాలయాలు- ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం District Employment Offices in AP: జిల్లా ఉపాధి కార్యాలయాలు ఒకప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులతో కిటకిటలాడేవి. ఉద్యోగం వచ్చినా.. రాకపోయినా నమోదు చేసుకుంటే అదే పదివేలని భావించేవారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుద్యోగులు ఉపాధి కార్యాలయాలకే రావడం మానుకున్నారు. దీంతో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు వెలవెలపోతున్నాయి.
చదువు పూర్తిచేసుకున్న యువతకు ఉపాధి చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. గతంలో నిరుద్యోగ యువత ప్రభుత్వ సంస్థల్లో కొలువు పొందాలంటే.. ఉపాధి శిక్షణ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకునేవారు. గతంతో పోల్చిచూస్తే.. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఉపాధి శిక్షణ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవడానికి నిరుద్యోగులు ఆసక్తి చూపడం లేదు.
'మెగా' డీఎస్సీ హామీ గుర్తుందా జగన్?
ఎన్టీఆర్ జిల్లాలో 2021లో 41వేల39 మంది ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోగా 2022లో ఆ సంఖ్య 33వేల 711కి, 2023 డిసెంబర్ నాటికి 28వేల 17కు తగ్గింది. గతంలో మినీ, మెగా జాబ్ మేళాల నిర్వహణకు ప్రభుత్వం నిధులిచ్చేది. ఇప్పుడు ఆ నిధులు రావడం లేదు.
"రాష్ట్రంలో 2 లక్షల 36 వేల పోస్టులు, మెగా డీఎస్సీ పేరుతో 50 వేల పోస్టులు ఖాళీగా ఉండగా ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ చేసే పరిస్థితి లేదు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించామని అనటం సరికాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. గతంలో జిల్లా ఉపాధి కార్యాలయాలు విద్యార్థులు, నిరుద్యోగులతో కిటకిటలాడేవి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరుద్యోగులు ఉపాధి కార్యాలయాలకే రావడం మానుకున్నారు. దీంతో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు వెలవెలపోతున్నాయి."- లంకా గోవిందరాజులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి
జగన్పై ధ్వజమెత్తిన నిరుద్యోగులు - చికెన్, మటన్ అమ్ముతూ వినూత్న నిరసన
నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయం కొత్తగా.. ఆన్‌లైన్‌లో అర్హతల నమోదు ప్రక్రియ ప్రారంభించింది. అర్హతల నమోదు, అప్‌గ్రెడేషన్ కోసం కార్యాలయాలకు రాకుండా.. ఇంటి వద్ద నుంచే నిరుద్యోగులు వివరాలు నమోదు చేసుకుంటున్నారని.. ఉపాధి కల్పన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పించేలా తరచూ.. ఉద్యోగ మేళాలు నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.