తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐడియా అదిరింది గురూ!! - మండుటెండలో కూల్ ​కూల్ రైడ్ - COOL TECHNIQUE FOR SCOOTY RIDE - COOL TECHNIQUE FOR SCOOTY RIDE

Cool Ride On Scooty in Summer : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారుల బాధలు అయితే మరీ వర్ణనాతీతం. వారు ఎక్కడికి వెళ్లాలన్నా ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఓ ద్విచక్ర వాహనదారుడు అదిరిపోయే ఓ కూల్ ఐడియా ఆలోచించి హాట్ సమ్మర్​లో తన స్కూటీపై కూల్ కూల్​గా ప్రయాణిస్తున్నాడు.

Disabled Person Green Mat on Scooty
స్కూటీపై గ్రీన్ మ్యాట్ వేసిన వృద్ధుడు​ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 1:54 PM IST

Green Mat On Scooty TO Prevent Sun Burn : సూర్యుడు తన ఉగ్రరూపాన్ని భూతలంపై చూపిస్తున్నాడు. నిత్యం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ భూమిపై వేడి పెరిగిపోతుంది. మునుపెన్నడు చూడని ఉష్ణోగ్రతలను 2024లో ముఖ్యంగా ఏప్రిల్​, మే నెలలో చూస్తున్నాం. దీంతో మానవాళితో పాటు జంతువులు, పక్షులు, కీటకాలు అల్లాడిపోతున్నాయి. ఏదైనా అవసరానికి బయటకు వెళ్దామంటే జంకే పరిస్థితికి జనాలు వచ్చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు. వెళ్లక తప్పదు అన్నప్పుడు ఇక తలపై టోపీలు ధరిస్తూ, స్కార్ఫ్ చుట్టుకుంటూ వెంట నీళ్ల సీసా తీసుకెళ్తూ ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బైక్​పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరిస్తున్నా, దాని వల్ల ఇంకా ఉక్కపోత ఎక్కువవుతోంది తప్ప తగ్గడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇక ట్రాఫిక్ జామ్​లో ఎదురుచూడాల్సి వచ్చినప్పుడు ఆ భానుడి భగభగలకు మండిపోతున్నామని వాపోతున్నారు.

ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ వాహనదారుడు ఎండకు మండకుండా తన వాహనం కోసం ఓ ఉపాయం ఆలోచించాడు. వినూత్నంగా ఆలోచించి ఎండల నుంచి తాత్కాలిక ఉపశనం కలిగేలా తన ద్విచక్ర వాహనంపై గ్రీన్​ మ్యాట్​ను ఏర్పాటు చేశాడు మంచిర్యాల జిల్లా నస్పూర్​ కాలనీకి చెందిన దివ్యాంగుడు గోళ్ల శంకరయ్య. ఎండ, వేడిగాలులు తగలకుండా తన ద్విచక్ర వాహనానికి గ్రీన్​ మ్యాట్​ను ఏర్పాటు చేసుకొని, దానికి ఇరువైపులా మనీప్లాంట్​ నాలుగు మొక్కలను పెంచుతున్నారు.

ఎంత ఎండలో ప్రయాణించినా చల్లగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. గ్రీన్ మ్యాట్​తో ఉన్న శంకరయ్య స్కూటీ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు, ఫొటోలు చూసి నెటిజన్లు సర్​ప్రైజ్ అవుతున్నారు. శంకరయ్య ఐడియాకు ఫిదా అవుతున్నారు. ఏం ఐడియా గురూ అంటూ ప్రశంసిస్తున్నారు. సూర్య బ్రోకే షాకిచ్చినవ్​లే శంకరయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎండల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • ఎండలోకి ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దు.
  • ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు వంటికి రక్షణ కోసం పట్టుకుని వెళ్లాలి.
  • మంచి నీటి వాటర్​ బాటిల్​ను పట్టుకుని వెళ్లాలి.
  • వడదెబ్బ తగులకుండా కొబ్బరి నీళ్లు, లెమన్​ వాటర్​ వంటివి తీసుకోవాలి.
  • ముఖ్యంగా మసాలా పదార్థాలు, కూల్​డ్రింక్స్​కు దూరంగా ఉండాలి.
  • ఎండలోకి వెళ్లేటప్పుడు సన్​ క్రీంలు వంటివి శరీరానికి పూసుకోవాలి.
  • వాటర్​ మిలాన్​, బొప్పాయి వంటి పండ్లను తీసుకోవాలి.

సమ్మర్​లో ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఎందుకో తెలుసా? - Summer Effects On Phone Charging

హాట్ సమ్మర్​లో కూల్​గా కార్ డ్రైవ్ చేయాలా? ఈ టాప్​-5 AC మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే! - Car AC Maintenance Tips

ABOUT THE AUTHOR

...view details