Disability Relief Scheme for Workers in TG : కూలి పనులు చేస్తూ జీవితం సాగించే కుటుంబాల్లో.. ఇంటిపెద్ద ఏదైనా ప్రమాదానికి గురై వైకల్యం సంభవిస్తే ఆ కుటుంబ పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. ఇలాంటి దీన స్థితిలో ఉండేవారికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం.. "డిసేబిలిటీ రిలీఫ్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఈ స్కీమ్ ద్వారా పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగి కార్మికుడికి శాశ్వత వైకల్యం సంభవిస్తే.. రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం, అదే.. పాక్షిక వైకల్యానికి రూ.4 లక్షల వరకు రిలీఫ్ ఫండ్ అందిస్తోంది. మరి.. ఇందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? ఏ ఏ పత్రాలు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అర్హతలు :
- ఆర్థిక సాయం పొందాలనుకుంటున్న బాధిత కార్మికుడు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యుడై ఉండాలి. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు జారీ చేసే గుర్తింపు కార్డు(Labour Card) కలిగి ఉండాలన్నమాట.
- పనిచేస్తున్న ప్రదేశంలో ప్రమాదం కారణంగా వైకల్యం సంభవించి ఉండాలి.
దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు :
- కార్మికుడి ఆధార్ కార్డ్
- బాధిత కార్మికుడి రిజిస్ట్రేషన్ కార్డ్(ఒరిజినల్)
- దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- రెన్యూవల్ చలాన్ కాపీ
- డిసేబిలిటీ సర్టిఫికెట్(అధికారులు జారీ చేసినది)
- FIR కాపీ (పోలీస్ కేసు నమోదైతే)
- అడ్వాన్స్ స్టాంపెడ్ రశీదు
- బ్యాంక్ పాస్‌బుక్ కాపీ