Digi Travel Services Start at visakhapatnam Airport by Central Minister Kinjarapu Rammohan Naidu :డిజియాత్ర మొబైల్ యాప్ విమాన ప్రయాణీకులకు సౌకర్యవంతంగానూ, సమయం కలిసి వచ్చేదిగాను ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇప్పటివరకు 54 లక్షల మంది యాప్ ద్వారా ప్రయోజనం పొందారని వివరించారు. విశాఖ విమానాశ్రయంలో ఈ-డిజియాత్రను ప్రారంభించారు. మరో ఎనిమిది ఎయిర్ పోర్టులలో డిజి యాత్ర సదుపాయాన్నివీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 12 ఎయిర్ పోర్టులకే ఈ సదుపాయం ఉందని, ఇప్పుడు అది 21 ఎయిర్ పోర్టులకు విస్తరించిందని వివరించారు.
ఎయిర్ పోర్టు కి వచ్చినపుడు నేరుగా డిజియాత్ర గేట్ ద్వారా వెళ్తే సమయం ఆదా అవుతుందని వివరించారు. పాతపద్దతిలో వెళ్తే నిమిషంన్నర వరకు సమయం పడితే, డిజియాత్ర ద్వారా కేవలం ఐదు సెకెన్లలోనే పని పూర్తవుతుందన్నారు. ఎయిర్ పోర్టులో మీ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు పౌర విమానయాన శాఖ తీసుకుందన్నారు. దేశంలో అన్ని ఎయిర్ పోర్టులలోనూ డిజియాత్ర సదుపాయం విస్తరిస్తామని చెప్పారు. మల్టిపుల్ పాయింట్స్‌లో విశాఖలో కొత్త ఎయిర్ పోర్టు రెండేళ్ల లోపుగానే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.