Different Types of Road Accidents in Andhra Pradesh : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. వివిధ ఘనటనల్లో ముగ్గురు మరణించగా పదుల సంఖ్యలో గాయాపడ్డారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పదిమందికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఆటో, కారు ఢీకొని ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లాలో బెంగళూరు నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెనూ ప్రమాదం తప్పింది.
పెళ్లి వస్త్రాల కొనుగోలుకు వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి - ROAD ACCIDENT
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు :నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఘటనలో మరో పది మందికి తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ప్రకాశం జిల్లా గన్నవరానికి చెందిన మరియమ్మ, వెలిగండ్ల మండలం కంగనంపాడుకు చెందిన డేవిడ్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కారు అతివేగంతో ఆటోను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదతీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం :తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదాలచెరువు వద్ద బెంగళూరు నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపేయడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు కారును తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని పోలీసులు చెప్పారు. బస్సు రెండు అడుగులు ముందుకు వెళ్లుంటే పక్కనున్న కాలువలో పడిపోయే ప్రమాదముందని చెప్పారు.
అతివేగంతో పోతున్న అమాయకుల ప్రాణాలు :ప్రకాశం జిల్లా కనిగిరిలో జాతీయ రహదారిపై ఆటో, కారు ఢీకొని ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి ఒంగోలు వైపుకు వెళుతున్న ఆటోను ఒంగోలు నుంచి వస్తున్న కారు ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న విష్ణు నారాయణ మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగంగా వస్తున్న కారేనని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను బట్టి అర్థమవుతుంది.
ప్రాణాలను హరిస్తున్న రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి, పదుల సంఖ్యలో గాయాలు (ETV Bharat) హైవేపై వరుసగా ఢీకొన్న కార్లు- ప్రయాణికులు సేఫ్ - Road Accident in NTR District
పల్నాడు జిల్లాలో బస్సు-టిప్పర్ ఢీ - ఆరుగురు దుర్మరణం - PALNADU ROAD ACCIDENT TODAY