Devaragattu Bunny Festival 2024 in kurnool District :ఆ సంప్రదాయ ఉత్సవంలో హింస చెలరేగి ఎంతో మంది గాయాలపాలవుతారు. అయినా ఆచారంగా వస్తున్న వేడుకని అక్కడి ప్రజలు ఆపరు. ఈ సంవత్సరమైనా హింసకు తావులేకుండా బన్ని ఉత్సవాన్ని నిర్వహించాలని పోలీస్ అధికారులు పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది.
సమరానికి సిద్ధమైన దేవరగట్టు : కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతీ దసరాకు ముందు రోజురాత్రి కర్రల సమరం అనాదిగా జరుగుతోంది. దేవరగట్టు వద్ద కొండపై మాళమల్లేశ్వరస్వామి ఆలయం వెలిసింది. గుడిలోని దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పర్వదినాన అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. వాటిని దక్కించుకోవడం నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామస్థులు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. దీన్నే బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు.
దేవరగట్టులో కర్రల సమరం - సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్ఠ నిఘా : ఎస్పీ బిందు మాధవ్
కొట్టుకోవడానికి ఎవరూ రారండి. అప్పుడు అడవి ప్రాంతం కాబట్టి వెలుతురు కోసం దివిటీలు, రక్షణ కోసం కర్రలు తీసుకువెళ్లి మా దేవుని కార్యక్రమాలు చేసుకొని వచ్చేవారు. అదే సంప్రదాయం ఇప్పుడు కొనసాగింది. ఇది సమరం కాదండి. సంప్రదాయం -గిరిమల్లయ్యస్వామి, మాళమల్లేశ్వరస్వామి ఆలయ పూజారి
కర్రల సమరానికి సమయమిది - 'దేవర'గట్టు జాతర మొదలైంది!
విగ్రహాల కోసం కర్రలతో సమరం :కర్రల సమరాన్ని చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ బిందుమాధవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రింగులు తొడిగిన కర్రలను స్వాధీనం చేసుకుంటున్నారు. మద్యాన్ని నియంత్రించేందుకు తనిఖీలు చేస్తున్నారు. దేవరగట్టు పరిసరాల్లో విద్యుత్ దీపాలు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఉత్సవం దృశ్యాలను రికార్డు చేస్తామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. బన్ని ఉత్సవాల్లో హింసను అరికట్టాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీచేసినా ఫలితం లేకుండా పోతోందని, అధికారులే దగ్గరుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
Devaragattu Banni Festival Celebrations: దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం.. మూడుకు చేరిన మృతుల సంఖ్య