ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాదాపు 10గంటల పాటు అధికారులతో సమీక్ష - కేంద్ర నిధుల మళ్లింపుపై పవన్ కల్యాణ్ ఆరా - Pawan Kalyan Meeting with Officers - PAWAN KALYAN MEETING WITH OFFICERS

Deputy CM Pawan Kalyan Meeting with Officers: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటి సమీక్షలోనే అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి 10 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించారా అని ఆరా తీశారు. ఇవాళ గ్రామీణ తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్ విభాగాలపై పవన్ సమీక్షించనున్నారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 11:35 AM IST

Deputy CM Pawan Kalyan Meeting with Officers : విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం పంచాయతీరాజ్‌, గ్రామీణభివృద్ధి శాఖలపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు మళ్లించారు? సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదా ఉపాధి వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి కారణమేంటి? అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీలో ఎందుకు వెనుకబడ్డారు? ఉపాధి కూలీలకు వేతనాల్లో చెల్లింపుల్లో జాప్యానికి కారణం ఎవరని నిలదీశారు. పవన్ నుంచి ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన అధికారులు సరిగా సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ సమయంలో మళ్లీ కలగజేసుకున్న పవన్‌, తాను లేవనెత్తిన అంశాలపై మరోసారి సమగ్రంగా చర్చిద్దామని, సంసిద్ధులై ఉండాలని సూచించారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ బాధ్యతలు - పలు దస్త్రాలపై సంతకాలు - Pawan Kalyan Charge as Deputy CM

కూర్చోడానికి కుర్చీలూ లేవా? :వివిధ అంశాలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వగా పవన్‌ తనకున్న, అనుమానాలను ప్రస్తావించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, కమిషనర్‌ కన్నబాబు వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చిందని? సర్పంచులకు వాటిపై పర్యవేక్షణ, నియంత్రణ లేకపోతే ఎలాగని పవన్‌ ప్రశ్నించారు.

గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు కూర్చోడానికి కుర్చీలూ లేవా అని నిలదీశారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ఆడిగారు. పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాల విషయంలో కేరళలో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఆదర్శంగా ఉన్నాయని, ఏపీలోనూ అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని అన్నారు. సమగ్రంగా చర్చించి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్‌ నిర్దేశించారు.

సమర్ధుడైన వ్యక్తికి మంచి బాధ్యతలు దక్కాయి: నాగబాబు - Nagababu on Pawan Taking Charge

చెబితే నేర్చుకోడానికి సిద్ధం :అధికారులు స్వేచ్ఛగా, త్రికరణ శుద్ధితో పని చేయొచ్చని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదని, ఎవరైనా జోక్యం చేసుకుంటే చెప్పాలని కోరారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. చెబితే నేర్చుకోడానికి తాను సిద్ధమేనని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా అరకులో పర్యటిద్దామని సూచించారు.

గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను గాడిలో పెట్టాలని, గతంలో విజయవంతంగా అమలైన వ్యవస్థని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కన పెట్టడంతో ఊళ్లలో ఎల్‌ఈడీలు వెలగడం లేదని గుర్తు చేశారు. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఇచ్చే జల జీవన్‌ మిషన్‌ పథకం పనుల్ని గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ- అమరావతిలో జనసేనానికి ఘన స్వాగతం - Pawan Kalyan met with Chandrababu

ABOUT THE AUTHOR

...view details