Pawan Kalyan meets Union Ministers in Delhi:రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటనలో నిమగ్నమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై కేంద్ర ఆర్థిక, జలవనరులు, పర్యాటక, రైల్వే శాఖల మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. పలు ప్రాజెక్టుల రుణాల చెల్లింపు గడువును పెంచాలని విజ్ఞప్తి చేశారు. వారితో సమాలోచనల అనంతరం రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్రమంత్రులు భరోసా ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
Pavan Kalyan meets Gajendra Singh Shekhawat:మొదటగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఏపీలో టూరిజం యూనివర్సిటీ సహా 7 ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఆయన వద్ద ప్రస్తావించారు. తమ ప్రతిపాదనపై కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు.
అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే - వారిని శిక్షించకపోతే సమాజానికే ఇబ్బంది : సీఎం
Pavan Kalyan meets CR Patil:అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్ బడ్జెట్, కాలవ్యవధి పెంచాలని ఆయన్ని కోరినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో నీటి సమస్యలు, పైపు డిజైన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా తీసుకున్న నిర్ణయాలు, తప్పులు తమకు వారసత్వంగా వచ్చాయన్న పవన్ వాటిని సరిదిద్దుతున్నామన్నారు.