ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవ మనుగడకు ప్లాస్టిక్ శరాఘాతం - జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి : పవన్ కల్యాణ్ - Pawan Kalyan in Wildlife Program

మంగళగిరిలో నిర్వహించిన వన్యప్రాణి వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను పవన్ ప్రారంభించారు.

Pawan_Kalyan_in_Wildlife_Program
Pawan_Kalyan_in_Wildlife_Program (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2024, 3:39 PM IST

Deputy CM Pawan Kalyan Attended Wildlife Celebrations:పర్యావరణాన్ని పరిరక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుధైక కుటుంబం అనే పేరు సార్ధకమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని అరణ్య భవన్​లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను డిప్యూటీ సీఎం ఆసక్తిగా తిలకించారు. తన చరవాణిలో ఫొటోలు తీసి భద్రపరచుకున్నారు. వాటి రక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు పవన్ కల్యాణ్​కి వివరించారు.

గిరిజనులు వినియోగించే విలంబును పవన్ ఆసక్తిగా పరిశీలించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం తయారుచేసిన మెరైన్ ఫానా యాప్​ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. కింగ్ కోబ్రా సంరక్షణపై రూపొందించిన బ్రోచర్​ని ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో విజయం సాధించిన వారికి పవన్ కల్యాణ్ బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించాలని అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details