Deputy CM Bhatti Vikramarka Participate in the Sravanapalli Coal Mine Auction : రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే విద్యుత్, బొగ్గు అత్యంత అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని తెలిపారు. సింగరేణి బొగ్గుతోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయని స్పష్టం చేశారు. సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో బొగ్గు గనులకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. మొట్టమొదటసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకోవాలని పాల్గొన్నానంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
ఎన్ఎండీఆర్ యాక్టుకు ముందు ట్రైపాక్షిక ఒప్పందం ప్రకారం సింగరేణి సంస్థకే పూర్తి అధికారం ఉండేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ 2015లో సవరించిన ఎన్ఎండీఆర్ ప్రకారం సింగరేణి తన హక్కును కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం 17(ఏ)2 ప్రకారం బొగ్గు గనులు కేటాయించాలని సింగరేణి కోరిందని పేర్కొన్నారు. సత్తుపల్లి 3, కొయ్యగూడెం 3 గనులు ఉన్నాయని చెప్పారు. వీటిని కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని సూచించారు. వేలం పాట నిర్వహిస్తే ఇందులో పాల్గొని అయిన గత ప్రభుత్వం గనులను సాధించుకోవాల్సి ఉంది. కానీ అలా చేయలేదని వివరించారు. 39 గనులు 42 వేల కార్మికులతో ఉన్న సింగరేణి, 8 గనులు ఎనిమిది వేల కార్మికులకు పడిపోయే అవకాశం ఉందని ఆవేదన చెందారు.