ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ శాఖలే నాకు ఇష్టం.. అవే కేటాయించారు: పవన్‌ కల్యాణ్‌ - Deputy Chief Minister Pawan - DEPUTY CHIEF MINISTER PAWAN

Deputy Chief Minister Pawan comments: మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన మూల సిద్ధాంతాలకు, తన మనసుకు దగ్గరగా ఉన్నాయని పవన్‌ అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Deputy Chief Minister Pawan
Deputy Chief Minister Pawan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 6:48 PM IST

Deputy Chief Minister Pawan comments: తనకు కేటాయించిన శాఖలపై జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు, తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. తాను అనుకున్న కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని జనసేనాని ఓ ప్రకటనలో తెలిపారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

ఉపాధి హామీ నిధుల సద్వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సాదిస్తానని పవన్‌ పేర్కొన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అటవీ సంపదను కాపాడి, పచ్చదనాన్ని పెంచుతామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పవన్ హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు.
పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్న సీఎం చంద్రబాబు - ప్రక్షాళన ప్రారంభం - Public Grievance Redressal

నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌కు ప్రజా ప్రయోజన శాఖల బాధ్యతలు అప్పగించడం పట్ల పవన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తామన్నారు. సినీ రంగానికి రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం నెలకొల్పుతామని వివరించారు. సినీ పరిశ్రమకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఆ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తానని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్: తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కృష్ణతేజ త్రిస్సూర్‌ కలెక్టర్‌గా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ఆయన ఉత్తమ విధానాలు అనుసరించారని గుర్తుచేశారు. కరోనా, కేరళ వరదల విపత్తుల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మరచిపోలేదని పవన్‌ తెలిపారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదా - Pawan Kalyan Key Role in Cabinet

ABOUT THE AUTHOR

...view details