టీడీపీ స్టిక్కర్లు అతికించుకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తాం: ఉపముఖ్యమంత్రి అంజాద్‌భాష Deputy chief MinisterAmjad BashaTore TDP stickers and Made Threats: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైయస్సార్ కడపలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు, బెదిరింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. పేదలు, బడుగు, బలహీన వర్గాల వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఆగడాలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఓటమి భయం ఎక్కువయ్యి మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఆసక్తికరంగా వైసీపీ ఫ్లెక్సీలు - చర్చనీయాంశంగా ఒంగోలు రాజకీయం
TDP Polit Buro Member Srinivasa Reddy Fires on YSRCP Gov:గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష కడప నగరంలోని 31వ డివిజన్లో ఆదివారం పర్యటించారు. ఈ సమయంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయి నివాసాలకు అతికించిన టీడీపీ స్టిక్కర్లను చించేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అంజద్ భాషాకు ఓటమి భయం పట్టుకుందని, ఓటమి భయంతో మతి భ్రమించి అతను ఏం చేస్తున్నారో తెలియడం లేదని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్లెక్సీలు, స్టిక్కర్లు చించినంత మాత్రానా ప్రజల్లో టీడీపీపై అభిమానం తగ్గదని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
జిల్లాలో మోచంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న నివాసాలకు టీడీపీ స్టిక్కర్లు అతికించారు. ఆదివారం రాత్రి ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష స్థానిక కార్పొరేటర్, వైసీపీ కార్యకర్తలు అందరూ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో స్థానిక నివాసాలకు టీడీపీ స్టిక్కర్లు కనిపించడంతో ఆగ్రహానికి లోనయి వెంటనే వాటిని ఉపముఖ్యమంత్రి సమక్షంలోనే కార్యకర్తలు చించేశారు. ఆ ఇంటి యజమానిని పిలిపించి నువ్వు టీడీపీ స్టిక్కర్లు అతికించుకుంటావా? నీకు ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు సయ్యాద్ నాయబ్ తెలిపారు. తనకు ఎటువంటి హాని జరిగిన అంజాద్ భాష, అతని అనుచరులే కారణమని బాధితుడు సయ్యాద్ నాయబ్ పేర్కొన్నారు.
YCP leaders threatened the high officials in chittor వైసీపీ నేతల ఆగడాలు.. ఏకంగా ఉన్నతాధికారులకే బెదిరింపులు.. దిక్కుతోచని స్థితిలో ఎమ్మార్వో
టీడీపీ అంటే అభిమానం అని, టీడీపీ స్టిక్కర్లు ఎందుకు తొలగిస్తున్నారని ఇంటి యజమాని ప్రశ్నించగా నీ అంతు చూస్తాం అంటూ బెదిరించారని బాధితుడు తెలిపారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వైసీపీ నేతలు చించేసిన స్టిక్కర్లను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్ రెడ్డితో పాటు టీడీపీ కార్యకర్తలు, అనుచరులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. స్టిక్కర్లు చించి వేసిన అంజాద్ భాష, అతని అనుచరులపై ఫిర్యాదు చేశారు. తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓడిపోతామని భయంతోనే అంజాద్ భాష ఇలా చేస్తున్నారని శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ నేతలు ఇలాంటి దురాగాతాలు ఎన్ని చేసినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీనివాసరావు తెలిపారు.
వైసీపీ నేత చంపేస్తానని బెదిరిస్తున్నాడు - నన్ను రక్షించండి : సెల్ఫీ వీడియోలో సామాన్యుడి ఆందోళన