తెలంగాణ

telangana

ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలు - కాకినాడలో అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు - Hydra style demolitions in kakinada

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Illegal Constructions Demolition in Kakinada : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని తెలిస్తే చాలు, బుల్డోజర్లు అక్కడ వాలిపోతున్నాయి. క్షణాల్లోనే నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఈ తరహా చర్యలు కొనసాగుతుండగా, తాజాగా హైడ్రా ప్రభావం ఏపీ వరకు పాకింది. కాకినాడలోని అక్రమ నిర్మాణాలను ఆ నగరపాలక సంస్థ బుల్డోజర్లతో నేలమట్టం చేసింది.

Kakinada Demolitions
Demolitions in Kakinada (ETV Bharat)

Illegal Constructions Demolition in Kakinada : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నగర పాలక సంస్థ అధికారులు 'హైడ్రా' తరహా చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపించారు. కాకినాడ సంత చెరువు సెంటర్‌లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని నేలమట్టం చేస్తున్నారు. గతంలో ద్వారంపూడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఎలాంటి అనుమతులు లేకుండానే దుకాణ సముదాయం నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details