తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్ అప్డేట్ - ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ - SPECIAL COURT DENIES KAVITHA BAIL

Delhi Rouse Avenue Court Denies Bail TO BRS MLC Kavitha : దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కవిత దాఖలు చేసిన మరో పిటిషన్​ను కోర్టు అనుమతించింది. అందులో ఆమె కోర్టులో నేరుగా హాజరుపరచాలంటూ అభ్యర్థించింది.

BRS MLC Kavitha Bail petitions Updates
BRS MLC Kavitha Bail petitions Updates (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 12:10 PM IST

Updated : May 6, 2024, 3:14 PM IST

Delhi Court Judgment on Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ (మే 6వ తేదీ) విచారణ చేపట్టిన కోర్టు తాజాగా ఈ విధంగా తీర్పునిచ్చింది. ప్రస్తుతం కవిత తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని కవిత బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కవిత దాఖలు చేసిన మరో పిటిషన్‌కు రౌస్ అవెన్యూ కోర్టుఅనుమతించింది. అందులో ఆమెను కోర్టులో నేరుగా హాజరుపరచాలంటూ కవిత పిటిషన్‌ ఫైల్​ చేశారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుకు అనుమతి చేయాలని కోరారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుండగా, మ.2 గం.కు కోర్టు ముందు దర్యాప్తు సంస్థల అధికారులు హాజరుపరచనున్నారు.

Kavitha Bail Petition Denied : ఆధారాలు లేకుండానే కవితను అరెస్టు చేశారని ఆమె తరపు న్యాయవాది రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించారు. అరెస్టుకు సరైన కారణాలు లేవని వివరించారు. మరోవైపు సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆమె బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. మద్యం కేసులో కవితే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానానికి తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది.

జపమాల, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం - వీటిని ఇచ్చేందుకు కవితకు కోర్టు అనుమతి - Court Grants Facilities to Kavitha

దిల్లీ మద్యం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు మార్చి 15న అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిహాడ్​ జైలులో ఉన్న ఆమె, తనకు సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రౌస్​ అవెన్యూ కోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. మే 6న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

మరోవైపు దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 2న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈనెల 6న తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. అలా ఈడీ, సీబీఐ రెండు బెయిల్ పిటిషన్లపై 6వ తేదీనే తుది ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే ఈరోజు బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.

లిక్కర్ స్కామ్​తో నాకు సంబంధం లేదు - నాకెలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు : కవిత - MLC Kavita Letter to Judge

'కవిత విచారణకు సహకరించలేదు - తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు' - delhi liquor scam case updates

Last Updated : May 6, 2024, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details