Defeat of YSRCP Ministers 2024 AP Elections : రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడా అధిక్యత చాటుకోలేక పోతున్నారు. ఇదిలా ఉండగా మంత్రులు సైతం అధిక్యంలో నిలవలేక పోతున్నారు. పెద్దిరెడ్డి, నగరిలో రోజా, డోన్ నుంచి బుగ్గన, గుడివాడ కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, సత్తెనపల్లి నుంచి అంబటి, గాజువాక గుడివాడ అమర్నాథ్ సైతం వెనుకంజలో ఉన్నారు.
నగరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజలో ఉండగా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌కు 936 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిపై 236 ఓట్ల ఆధిక్యంలో ఉండగా డోన్ నుంచి బుగ్గనపై టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అధిక్యంలో ఉన్నారు. గుడివాడ కొడాలి నాని పై టీడీపీ వెనిగండ్ల రాము, గన్నవరం నుంచి వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు, సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుపై టీడీపీ కన్నా లక్ష్మీ నారాయణ, గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చెయ్యాగా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌రావు ముందంజలో ఉన్నారు.