Baby Barasala Celebrations : ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి పుట్టిందని ఎంతో ఆనందంగా మురిసిపోతూ వేడుకలు జరుపుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందనగానే అత్తారింటి వాళ్లు అసంతృప్తి, కోడల్ని వేధించడం లాంటివి అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ తమకు సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టిందని సంతోషపడుతూ బారసాలలో కొత్త దనం చూపించారు. మనమరాలితో ఇంటికొచ్చిన కోడలికి అత్తింట్లో అపూర్వ స్వాగతం పలికారు.
కూతురిపై ప్రేమ : ఆ చిన్నారి తమ ఇంట్లో అడుగుపెట్టిన శుభసమయంలో పాపకు లక్ష రూపాయల విలువ చేసే రూ. 5 నాణేలు (కాయిన్స్) తో అలంకరించి వేడుక నిర్వహించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ప్రశాంత్, వర్ష దంపతులకు తొలి సంతానంలో కూతురు పుట్టింది.