Cylinder Blast In Boat : విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ల దూరంలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్నప్పుడు బోటులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కోస్ట్ గార్డ్ ప్రమాద స్థలానికి చేరుకుని మత్స్యకారుల్ని కాపాడింది. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చేపల వేటకు వెళ్లిన బోటు నడిసంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైంది.
Boat Fire Accident : కాకినాడ జిల్లా ఏటిమొగకు చెందిన 9 మంది మత్స్యకారులు గత నెల 24న కాకినాడకు చెందిన శ్రీ దుర్గా భవాని బోటులో చేపల వేటకు బయలుదేరారు. శుక్రవారం విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ల దూరంలో వేట సాగిస్తుండగా జనరేటర్‌లో మంటలు చెలరేగి బోటును చుట్టుముట్టాయి. జాలర్ల సమాచారంతో కోస్ట్‌గార్డ్ నౌక 'వీర' వెంటనే అక్కడికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న మత్స్యకారులకు ప్రథమ చికిత్స అందించి రక్షించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మరో ఐదుగురి శరీర భాగాలు 30 శాతంపైగా కాలిపోయాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్(KGH) ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ - బాలుడికి తీవ్ర గాయాలు - Cylinder Blast In Secunderabad