Cyber Security Bureau In Telangana :సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్‌శాఖ వ్యూహాత్మక అడుగులేస్తోంది. దేశంలో తొలిసారిగా తెలంగాణలో సైబర్ సెక్యురిటీ బ్యూరో ఏర్పాటు, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయగానే వేగంగా స్పందించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. బాధితులు సకాలంలో ఫిర్యాదు చేస్తే వారు పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి సైబర్‌సెక్యురిటీ బ్యూరో రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Cyber Security Bureau) ఎప్పటికప్పుడు సాంకేతికను మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా నేరగాళ్లు ఉపయోగించే మెయిల్స్, వెబ్‌సైట్లు, సిమ్‌కార్డుల డేటా సేకరించి ఎప్పటికప్పుడు తొలగించేందుకు రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది.
టాస్క్ పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు - రూ.49.45 లక్షలు దోచుకున్నారు
Cyber Crimes : ఇప్పటి వరకూ దాదాపు 23 వేల బ్యాంకు ఖాతాలు, 750కిపైగా ఈ-మెయిల్‌ఐడీలు, 22 వేల వెబ్‌సైట్లు, 28 వేల సిమ్‌కార్డుల వివరాలు సేకరించింది. అందులో కొన్నింటి ద్వారా సైబర్ నేరాలు (Cyber Crimes) జరిగినట్లు నిర్థారించుకొని నిర్వీర్యం చేసింది. గతేడాది అందుబాటులోకిచ్చిన డేటా అగ్రిగేషన్ అండ్ అనాలసిస్ యూనిట్, థ్రెట్ ఇంటలిజెన్స్ యూనిట్ ద్వారా అది సాధ్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన 858 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు సైబర్ నేరాల్లో వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు.
"కంప్లయింట్ తీసుకున్న అనుమానితుని సమాచారం ద్వారా అంకౌట్ నంబర్, ఫోన్ నంబర్స్, యూఆర్ఎల్ తీసుకుని డీయుఇ టీం వారు విశ్లేషణ చేస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న రిజిస్టర్ అయిన సమాచారం తీసుకుని లోకల్ పోలీస్‌ల ద్వారా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. తద్వారా నిందితున్ని, రిమాండ్ పంపిస్తాం." -శ్రవణ్ కుమార్, సైబర్ సెక్యూరిటీ అధికారి