తెలంగాణ

telangana

ETV Bharat / state

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు - సీవీ ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్ - Fake Facebook In the Name Of Police

CV Anand Fake Facebook Accounts : సైబర్ కేటుగాళ్లు పోలీసులకే టోపీలు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు తెరచి పోలీసుల స్నేహితుల నుంచి డబ్బు నొక్కేస్తున్నారు. అత్యవసరం అంటూ మెసేజ్​లు పెడుతూ నగదు దోచేస్తున్నారు. తాజాగా ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.

Online Investment Frauds Telangana
CV Anand Fake Facebook Accounts

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 4:50 PM IST

CV Anand Fake Facebook Accounts: రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు​ రోజు రోజుకు మితిమీరిపోతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి క్యూఆర్​ కోడ్లు, లింకులు, పంపిస్తూ జనం నుంచి డబ్బులను దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తాజాగా ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సైబర్ నేరుగాళ్లు నకిలీ ఫేస్​బుక్ ఖాతాలను తెరిచి డబ్బులు వసూలు చేస్తున్నారు.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు రెండు నకిలీ ఖాతాలు క్రియేట్ చేశారు. ఇవాళ ఈ ఖాతాలు వైరల్ కావడంతో సీవీ ఆనంద్ దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఐపీ అడ్రస్​ల ద్యారా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

రూ.1500 పెట్టుబడి పెడితే వంద రోజులపాటు రోజుకు రూ.50 - సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పోలీసులు

Online Investment Frauds Telangana : తాజాగా హైదరాబాద్​లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ పోలీసులనే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వారిని నమ్మి దాదాపు రూ.75 లక్షలకుపైనే పోలీసులు పెట్టుబడి పెట్టారు. నిందితులు డబ్బు వసూలు చేసి పారిపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు.

తమ పేరుతో ఫేక్ అకౌంట్లు వినియోగిస్తూ డబ్బులు దండుకోవడం పోలీస్ శాఖలో కలవరం కలిగించింది. ఇప్పటికే హైదరాబాద్​లోని మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేరుతోనూ నకిలీ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లు దందా మొదలుపెట్టారు. ఈ మోసాలను గుర్తించని కొందరు వారు అడిగినంత డబ్బులు ఇస్తుంటే, అనుమానం వచ్చిన వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు.

98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్

Fake Facebook In the Name Of Police:గతంలో ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె స్నేహితులు బంధువులు పోలీస్ అధికారులకు డబ్బులు కావాలని మెసేజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మంది పోలీసు అధికారులు పేరిట నకిలీ ఖాతాలు సైబర్ నేరగాళ్లు సృష్టించి డబ్బులు అడుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నకిలీ ఫేస్​బుక్ అకౌంట్లతో ఎవరైనా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

సైబర్ నేరాల కట్టిడికి కొత్త వ్యూహాలతో సమాయత్తమవుతున్న పోలీసులు

కాంగ్రెస్​ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌, భారీగా నిధుల సేకరణ - రాజస్థాన్​లో నిందితుడి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details