ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊరూ వాడా హర్​ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించాలి- ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి: సీఎస్ - CS Nirab Kumar on Har Ghar Tiranga - CS NIRAB KUMAR ON HAR GHAR TIRANGA

CS Nirab Kumar on Har Ghar Tiranga Programme: ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.

cs_nirab_kumar_on_har_ghar_tiranga
cs_nirab_kumar_on_har_ghar_tiranga (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 4:34 PM IST

CS Nirab Kumar on Har Ghar Tiranga Programme:రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై ఆయన జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు, జాతీయ జెండా ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేసి వారిలో చైతన్యాన్ని కలిగించేందుకు ఊరూ వాడా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహించాలని స్పష్టం చేశారు.

15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోను, ఎట్ హోం కార్యక్రమంలోను ప్రజల్లో దేశభక్తి భావాలను కలిగించే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం అన్నారు. జాతీయ జెండాతో ఉన్న సెల్ఫీ పొటోలను, వీడియోలను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా హర్ ఘర్ తిరంగా డాట్ కామ్​లో అప్ లోడ్ చేయాలని చెప్పారు. అనంతంరం హర్ ఘర్ తిరంగా కాన్వాస్​పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంతకం చేశారు.

పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 100 రోజుల కార్యాచరణ - మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న సీఎం - CBN REVIEW ON INDUSTRIAL PARKS

దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యం:ప్రజలందరికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యమని అన్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని సీఎం అన్నారు. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయమన్నారు. ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. అలాగే జాతీయ జెండాను తమ సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్​గా పెట్టుకోవాలన్నారు.

విద్యారంగంలో మెరుగైన ప్రమాణాలకు సహాయ, సహకారాలు అందిస్తాం- మంత్రి లోకేశ్​తో సింగపూర్ ప్రొఫెసర్ భేటీ - SINGAPORE PROFESSOR MET NARA LOKESH

భవిష్యత్తు అవసరాల మేరకు సిలబస్‌లో సమూల మార్పులు చేయాలి: సీఎం చంద్రబాబు - CM Review Meeting on Education

ABOUT THE AUTHOR

...view details