CS Jawahar Reddy on pensions distribution:పెన్షన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. సెర్ప్ జారీ చేసిన సర్కులర్ అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నాయి. పెన్షన్ల పంపిణీపై సెర్ప్ జారీ చేసిన సర్కులర్కు వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెన్షన్ పంపిణీ పేరుతో వైసీపీ రాజకీయం చేస్తుందని ఆరోపిస్తున్నాయి. టీడీపీ నేతలు సైతం పెన్షన్ అంశంపై సచివాలయానికి వాహన ర్యాలీ నిర్వహించారు. పెన్షన్ పంపిణీ విషయంలో ఆందోళన నెలకొన్న వేళ సీఎస్ జవహార్ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. పెన్షన్ పంపిణీపై అనుసరించాల్సిన విధానాలను వారితో చర్చించారు.
పెన్షన్ల పంపిణీ అంశంపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని పలువురు కలెక్టర్లు తెలిపారు. గ్రామ, వార్డు సెక్రటరీలతో పెన్షన్లు పంపిణీ చేసినా, వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని పలువురు కలెక్టర్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ ఇబ్బంది లేదన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కొంచెం కష్టతరమవుతుందనీ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని నిర్ణయిస్తే సచివాలయాల వద్ద టెంట్లు, తాగు నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్లు కోరారు. ఇవాళ రాత్రికి పెన్షన్ల పంపిణీ మీద మార్గదర్శకాలు సిద్దం చేస్తామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు.
జగన్ పింఛనర్ల పొట్టకొట్టారు - దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు: చంద్రబాబు - Chandrababu on Pensions Delay in AP