తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రమంతా పంటలు ఎండుతున్నా - ఆ ఊర్లో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పొలాలే - కారణం ఏంటంటే? - Crops with spring wells - CROPS WITH SPRING WELLS

Crops with spring wells In Narayanpet : గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం వల్ల ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఎన్నో ఆశలతో యాసంగి సాగుచేసిన అన్నదాతలకు పంటలకు నీరు అందక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో చాలాచోట్ల కనిపిస్తోంది. చేతికి వచ్చే పంటలూ ఎండిపోయి కనీసం పెట్టుబడి రాక లబోదిబోమంటున్నారు. అందుకు భిన్నంగా నారాయణ పేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్‌లోని రైతులు మాత్రం ఊటబావులతో ఊరట చెందుతున్నారు

Narayanpet Crops with spring wells
Crops with spring wells In Narayanpet

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 1:56 PM IST

Updated : Apr 7, 2024, 2:29 PM IST

రాష్ట్రమంతా పంటలు ఎండుతున్నా - ఆ ఊర్లో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పొలాలే - కారణం ఏంటంటే?

Crops with spring wells In Narayanpet :రాష్ట్రంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. చేతికి వచ్చే పంటలు ఎండి ఎండిపోతున్నాయి. పశువులకు మేతగా వదులుతున్నారు. పంటను కాపాడుకోవాలని 400 నుంచి 500 అడుగుల లోతు వరకు బోరు బావులు తవ్వుతున్న చుక్క నీరు రావడం లేదు. అటు పంట సాగుకుపెట్టిన పెట్టుబడి, బోరు బావి తవ్వేందుకు చేసిన ఖర్చులు అప్పుల భారంగా మారుతుంది. అందుకు భిన్నంగా నారాయణ పేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామ రైతులు మాత్రం ఊటబావులతో పంటలు పండిస్తున్నారు.

వరదకాల్వలో నీరు లేక ఎండిపోతున్న పంటలు - ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతులు - Water Crisis In SRSP Canal

Spring wells in Summer : నారాయణపేట జిల్లా మర్రికల్ మండలం వెంకటాపూర్‌లో కోయిల్ సాగర్ జలాశయం ద్వారా రైతులు సాగు చేస్తుంటారు. వర్షాకాలం మినహా మిగతా కాలాల్లో మాత్రం ఊట బావులు వారి సాగుకు ఆధారంగా మారాయి. కోయిల్‌ సాగర్‌ జలాలు విడుదల సమయంలో ఆ నీరు ఊట బావుల్లోకి వచ్చి చేరుతోంది. మండు వేసవిలోనూ ఆ ఊర్లో ఉన్న వంద ఊటబావుల పరిధిలో సాగుచేసిన వరి పంటతో కళకళలాడుతోంది. మరి కొందరు రైతులు కూరగాయల పంటలకు ఢోకా లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎండాకాలంలో ఊట బావుల ఊరట: ఊట బావుల మూలంగా ఎండాకాలంలో ఎటువంటి నీటి ఎద్దడి తలెత్తకుండా రైతులకే కాదు స్థానికులకు ఊరట కలిగిస్తోంది. ఈ ఊట బావులు పూర్వ కాలం నుంచి నీటి ఇబ్బందులు లేకుండా వాడుకునేవారు.కోయిల్‌ సాగర్‌లో మరో తడి వరి వచ్చే వరకు నీటిని విడుదల చేస్తే ఊట బావులు లేని వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. చివరి తడి వరకు విడుదల చేస్తే ఊట బావులలోకి నీరు చేరుతుంది. దీంతో అందరికీ మంచి జరుగుతోందని రైతులు అంటోన్నారు. ఊట బావుల్లో గంగమ్మ పరవళ్లు తొక్కుతుండగా పంటలకు ఢోకా లేదని సాగుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉండగా వాటి మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నారు.

అప్పు చేసి సాగు చేస్తే - పండే దిక్కులేక పశువులకు మేతగా - ఎండిన పంటలను చూసి రైతన్న కన్నీరు - Water Crisis in jangaon

రాష్ట్రంలో ఎండుతున్న పంటలు - అన్నదాతకు తప్పని తిప్పలు - Telangana Farmers Worried Crop Loss

Last Updated : Apr 7, 2024, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details