Crocadile Halchal at Bypass Road in Palnadu District :పల్నాడు జిల్లాలో బైపాస్ రోడ్డుపై మొసలి కలకలం రేపింది. రాత్రి సమయంలో వాహనాలకు అడ్డంగా రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పిడుగురాళ్లలోని రిక్షా కాలనీకి సమీపంలో చిన్నచిన్న కాల్వలు, క్వారీ గుంతలు ఉన్నాయి. అక్కడే ఈ మొసలి నివాసం ఏర్పచుకుని ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచే బయటకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు.
నడిరోడ్డుపై మొసలి - హడలిపోయిన వాహనదారులు, స్థానికులు - CROCADILE HALCHAL IN PALNADU
పిడుగురాళ్లలోని బైపాస్ రోడ్డుపై రాత్రి సమయంలో వాహనాలకు అడ్డంగా వచ్చిన మొసలి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2024, 2:39 PM IST
వాహనాల శబ్దానికి రోడ్డుపైకి వచ్చిందని ఉంటుందని అంటున్నారు. మొసలి సంచారంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు అటవీశాఖ అధికారులు బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అప్పటికి ఆ మొసలి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రాత్రంతా వెతికినప్పటికీ మొసలి కనపడలేదు. బోను పెట్టి మొసలి స్థావరాలపై నిఘా పెడతామని అధికారులు చెబుతున్నారు. అతి త్వరలోనే బంధించి కృష్ణా నదిలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.