CRDA Calls for Tenders to Take up Constructions:ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం మంజూరు చేయటంతో అమరావతిలో పనుల్ని పరుగెత్తించేందుకు సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు వరుస టెండర్లను జారీ చేస్తున్నాయి. తాజాగా ఈ రెండు సంస్థలు కలిపి రూ.2,514 కోట్ల అంచనాలతో టెండర్లను పిలిచాయి. రాజధానిలో రోడ్ల నిర్మాణం లాంటి ట్రంక్ ఇన్ ఫ్రాతో పాటు, భూగర్బ విద్యుత్ కేబుళ్ల కోసం యుటిలీటీ డక్ట్లు, వరదనీటి కాలువలు, సీవరేజి, అవెన్యూ ప్లాంటేషన్, గెజిటెడ్ అధికారులు, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్లలో మిగిలిన పనులు చేపట్టేందుకు ఈ టెండర్లను జారీ చేశారు.
రాజధానిలోని రాయపూడి, నేలపాడు, కొండమరాజుపాలెం గ్రామాల్లోని జోన్ 3ఏ ప్రాంతంలో ప్రాంతంలో రహదారులు, డ్రెయిన్ల, నీటి సరఫరా ప్రాజెక్టుల లాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.505.53 కోట్లతో టెండర్లను పిలిచించింది. జోన్ 3 ఏ ప్రాంతంలో రహదారుల నిర్మాణం, డ్రెయిన్లు, నీటి సరఫరా, సీవరేజి, విద్యుత్, కమ్యూనికేషన్ కేబుళ్ల కోసం యుటిలిటీ డక్ట్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వీటితో పాటు పునర్వినియోగ నీటి పైపులైన్లు, అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది. దీంతో పాటు జోన్ 3 బీ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులను నిర్మించేందుకు, ఎల్పీఎస్ లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన, అవెన్యూ ప్లాంటేషన్ కోసం రూ.420.65 కోట్లతో మరో టెండర్‌ను కూడా సీఆర్డీఏ పిలిచింది.
ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీ సర్వే పూర్తి - మారనున్న ఆ ఏడు ప్రాంతాల రూపురేఖలు