CPM Politburo Member BV Raghavulu Criticizes BJP :వైరుధ్యాలను పక్కనపెట్టి బీజేపీను ఓడించాలని ఇండియా కూటమి నిర్ణయించిందని సీపీఎం(CPM) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. ఇండియా కూటమి నిర్ణయంతో బీజేపీకి భయం పట్టుకుందని చెప్పారు. కూటమిలోని నితీశ్‌ను ఎర వేసి లాక్కున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశం(CPm Meetings)లో పాల్గొన్న బీవీ రాఘవులు, బీజేపీపై విమర్శలు చేశారు. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు ఎన్నికలపై నేతలు చర్చించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లలేదని బీవీ రాఘవులు(BV Raghavulu) పేర్కొన్నారు. ఆ తప్పిదాల వల్ల రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని వివరించారు. గత తప్పిదాలను సరి చేసుకొని కాంగ్రెస్ ముందుకు వెళుతోందని అన్నారు. బీఆర్ఎస్ను బీజేపీ తనవైపు తిప్పుకుంటోందని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు తెలిపారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి చెబుతున్నారని అన్నారు.
'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్!
CPM State Level Meetings in Hyderabad : కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నువ్వే మూసిలో పడిపోతావు జాగ్రత్త అంటూ కిషన్ రెడ్డిని ఆయన హెచ్చరించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని డబ్బులు లేకుండా చేశాయని ఆవేదన చెందారు.