Contract Electricity Workers Demand to Fulfill Jagan Promises :జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజా సంకల్ప పాదయాత్రలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. హామీ ప్రకారం ఉద్యోగ భద్రత , సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. దీనిపై విజయవాడ ప్రెస్ క్లబ్‌లో APVTUSC వారు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఇచ్చిన హామీలను నేటి వరకు అమలు చేయలేదని APVTUSC ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి ధ్వజమెత్తారు. సమస్యలను పరిస్కరించపోతే ఫిబ్రవరి 2నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
చర్చలు విఫలం.. 10 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిస్కరించపోతే ఫిబ్రవరి రెండవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పి .సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రంగంలో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగా భధ్రత కల్పిస్తానని ఇచ్చిన హామీని నేటికి అమలు చేయలేదని మండిపడ్డారు.
విద్యుత్ కనెక్షన్లలో స్మార్ట్‌గా జగన్ దోపిడీ - పనేదైనా కమిషన్ కొట్టేయ్