శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద - సాయంత్రం గేట్లు ఎత్తనున్న అధికారులు - FLOOD TO SRISAILAM PROJECT - FLOOD TO SRISAILAM PROJECT
Flood to Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 4.36 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాయంత్రం 4 గంటలకు జలాశయం గేట్లు అధికారులు ఎత్తనున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 10:55 AM IST
|Updated : Jul 29, 2024, 11:52 AM IST
Flood to Srisailam Reservoir: జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో సాయంత్రం జలాశయం గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. నీటి ఉద్ధృతిని బట్టి 2 నుంచి 4 గేట్లు ఎత్తనున్నట్లు చెప్పారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలంలోకి 4 లక్షల క్యూసెక్కులు చేరాయి. భారీగా చేరిన నీటిని పోతిరెడ్డిపాడు, కల్వకుర్తికి మళ్లించనున్నారు. పోతిరెడ్డిపాడుకు 15 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 16 వందల క్యూసెక్కులు విడుదల చేయనున్నారు.