Congress Leaders Inaugurate CETP at Sangareddy :సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో రూ.104 కోట్లతో నిర్మించిన కాలుష్య వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఏషియాలో నెంబర్ వన్‌గా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కామన్ ఎఫ్లెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటును(ZLD-CETP) ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని, కానీ పని ఒత్తిడితో ఆయన రాలేకపోయారని, అందువల్ల మంత్రులతో కలిసి తాను ప్రారంభించినట్లు స్పీకర్ తెలిపారు. దీనితో వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తుందని, ఇది మంచి పరిణామం అన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లు పాలన చేసినా సక్రమంగా చేయలేదని దుయ్యబట్టారు. పదేళ్లలో దొరకని అనుమతులు 80 రోజుల్లో ఇచ్చేలా తమ ప్రభుత్వం పని చేసిందన్నారు. పారిశ్రామిక వాడలో నీటి సమస్యలు తీర్చాలని మంత్రి దామోదర రాజనర్సింహను(Minister Damodara Rajanarsimha) కోరుతున్నట్లు ఆయన చెప్పారు. రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని, భావితరాల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
దేశానికే దిక్సూచిగా మారనున్న ప్రాజెక్ట్ : పరిశ్రమలు పెరిగేకొద్దీ కాలుష్యం పెరిగిపోతుందన్నారు. పెరిగిన కాలుష్యం నివారించడం కష్టతరమైన పని, ముందుగానే నివారించే చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతికతను ఉపయోగించి కాలుష్యాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం(Central Govt) ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉందని తెలిపారు. ఇది విజయవంతం అవుతుందని మంత్రి కొండా సురేఖ భావిస్తున్నాని చెప్పారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ - పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం