ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.40 వేల కోట్ల అప్పుకోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు-అందుకోసమేనా? - Farmer Loan Waiver

Government borrowing for farmers loan waiver : రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం బాండ్ల విక్రయాలు, భూముల తాకట్టు, రైతు సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పాటు తదితర అంశాల్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది. రాబోయే బడ్డెట్​లో ఇందుకు సంబంధించి కేటాయింపుల కోసం కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే హామీల అమలుకు రూ.40 వేల కోట్ల అప్పు చేస్తోందనే వాదన వినిపిస్తోంది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 4:51 PM IST

Farmer Loan Waiver
Farmer Loan Waiver (ETV Bharat)

Telangana Government is Making Efforts to Collect Debt: రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. వచ్చే నెల 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది.

మరోవైపు (ఖరీఫ్‌) పంటల సాగు సీజన్‌ ప్రారంభమై ఇప్పటికే నెల గడిచింది. సెప్టెంబరుకల్లా ముగిసే ఈ సీజన్‌లో రైతు భరోసా (గతంలో రైతుబంధు) పథకం కింద ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాల్సి ఉంది. ఈ పథకానికి కనీసం రూ.5 వేల కోట్లయినా తక్షణం అవసరమని ఓ అంచనా. మరోవైపు 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి రూ.1500 కోట్ల ప్రీమియంను ఎల్‌ఐసీకి వచ్చే నెల 15లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

బాండ్ల ద్వారా రూ.15 వేల కోట్లకుపైగా : ప్రతి నెలా రూ.ఐదారు వేల కోట్ల రూపాయలు బాండ్లను విక్రయించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటోంది. జులై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయించడం ద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకూ తీసుకునేందుకు అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదికాకుండా ప్రభుత్వ భూములతో పాటుగా ‘తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ’(టీజీఐఐసీ) ద్వారా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లకు పైగా రుణాలను సేకరించేందుకు అవకాశాలున్నాయా అని ప్రభుత్వం పరిశీలిస్తుంది.

వారికి రుణమాఫీ లేదు - తేల్చి చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి !

అవసరమైతే భూముల తనఖా ద్వారా నిధుల కోసం ప్రత్యేకంగా, రైతు సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా రుణం తీసుకోవడంపైనా ఆలోచిస్తుంది. భూముల తాకట్టు, బాండ్ల విక్రయంపై ఎంత వరకూ నిధులు వస్తాయనేది కొద్దిరోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. ఈ విషయం తేలిన తరవాత మిగిలిన సొమ్మును ఎలా సేకరించాలనేదానిపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు ప్రారంభం నుంచి రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట రూ.50 వేలు, అనంతరం రూ.లక్ష.. ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణాల్ని చెల్లించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70 శాతమ మందికిపైగా రూ.లక్షలోపే రుణం ఉన్నట్లు ఓ అంచనా. రైతుభరోసా కింద పెట్టుబడి సాయానికి ఎవ్వరు అర్హులు అనేది అన్ని పక్షాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా : ఆయా ఉమ్మడి జిల్లాల్లో అన్ని పక్షాలతో ఈ పథకంపై కమిటీ చర్చించన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే వెల్లడించారు. నిజమైన రైతులందరికీ సాయం చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని భట్టి స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖకు ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువ శాతం సొమ్మును రుణాల ద్వారా సేకరించాల్సి ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం - క్యాబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్ష నియామకం వాయిదా! - CM Revanth on Cabinet Expansion

ABOUT THE AUTHOR

...view details