Congress Focus On Parliament Election : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించగా గాంధీ భవన్ వేదికగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(PCC Revanth Reddy) అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆశావహుల వివరాలు పరిశీలించింది. 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఇప్పటికే జిల్లా పార్టీ తీర్మానించి రాష్ట్ర పార్టీకి ప్రతిపాదనలు పంపింది.
కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు: మంత్రి ఉత్తమ్
Congress Focus On Khammam Parliament Seat : ఖమ్మం బరిలో ఎవరు నిలుస్తారు, అధిష్టానం ఎవరి అభ్యర్థిత్వం ఖరారు చేస్తుందన్నది ఇప్ఫుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశం. టికెట్ ఆశిస్తున్న వారిలో ముగ్గురి పేర్లతో పీఈసీ త్వరలోనే అధిష్ఠానానికి ప్రతిపాదించనుంది. పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, వి.హనుమంతరావు సీటు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు సైతం టికెట్ రేసులో ప్రధానంగా ఉన్నారు. ఏళ్లుగా పార్టీకి విధేయులుగా ఉన్న తమకు అవకాశం కల్పించాలంటూ రాయల నాగేశ్వరరావు, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మద్ది శ్రీనివాస్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.
ఖమ్మం బరిలో సోనియా గాంధీ : ఎవరికి వారే టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. టికెట్ దక్కించుకుంటే చాలు సగం విజయం సాధించినట్టేనని నేతలు భావిస్తున్నారు. పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi) ఖమ్మం బరిలో నిలిస్తే ఆమె ఘనవిజయం సాధించేలా పనిచేస్తామని ఆశావహులంతా ప్రకటించారు. ఒకవేళ ఆమె పోటీలో లేని పక్షంలో తమకంటే తమకు సీటు కేటాయించాలని పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు.