Congress Focus On Agriculture, Education Commission: రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా విద్య, వ్యవసాయ రంగాల బలోపేతమే లక్ష్యంగా కమిషన్లను ఏర్పాటు చేసింది. ఈ రెండింటికి ఛైర్మన్లను నియమించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిని నియమించింది.
Congress Focus On Agriculture Commission :ఈ కమిషన్‌లో ఆరుగురు సభ్యులకు గాను కొందరు వ్యవసాయ నిపుణులు ఉండాల్సి ఉంటుంది. మిగిలిన వారు కాంగ్రెస్ నేతలు అయినప్పటికీ వారికి వ్యవసాయంపై పట్టు ఉండాలి. ప్రమాణాలు కలిగిన సభ్యులను నియమిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. కమిషన్ వివిధ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి చేసే సిపారసులు వ్యవసాయం లాభసాటిగా మారి రైతుకు భరోసాని నింపుతాయని భావిస్తున్నారు. ప్రధానంగా నకిలీ విత్తనాలు నియంత్రించడం, రసాయన ఎరువులు వాడని పంటలు పండించేలా ప్రోత్సహించేందుకు కమిషన్ దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి : విద్యావిధానంలో మార్పులు తెచ్చేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన సర్కార్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని చైర్మన్‌గా నియమించారు. ఈ కమిషన్‌లో సభ్యుల నియామకం కోసం అర్హులైన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుత విద్యా విధానంపై అధ్యయనం చేసి మెరుగైన విధానం కోసం సిపారసు చేయనుంది.