CM YS Jagan Kadapa District Tour: వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) శనివారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. గన్నవరం నుంచి బయలుదేరి నేరుగా బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకుంటారు. కడప ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు.
YSRCP candidates-list-and-manifesto-announcement :ముందుగా శనివారం మధ్యాహ్నం తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి, ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం అక్కడే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన వైసీపీ అభ్యర్థుల (YSRCP Candidates List) పేర్లను జగన్ మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. అక్కడే వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను (YCP Manifesto) కూడా విడుదల చేయనున్నారు.
ఈనెల 16న వైసీపీ తుది జాబితా - ఆశావహులు, అసంతృప్తులతో సీఎం జగన్ భేటీ
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు అభ్యర్థుల ప్రకటన, మ్యానిఫెస్టో విడుదల పూర్తి చేయనున్నారు. అనంతరం గెస్ట్ హౌస్లో కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి కడప నుంచి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ నుంచి తాడేపల్లికి బయలు దేరనున్నారు. తర్వాత రెండు, మూడు రోజులకు ఎన్నికల ప్రచారాన్ని (YS Jagan Election Campaign) సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సిద్ధం సభల స్థాయిలోనే ఈ ఎన్నికల ప్రచార సభలను సైతం చేపట్టనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.