CM Revanth wants Vigilance Inquiry into Fish and Sheep Distribution : చేపలు, గొర్రెల పంపిణీపై విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఆ రెండు పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ విభాగానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమికంగా తేలిన అంశాలను ఏసీబీతో పంచుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Fish and Sheep Distribution Case :చేపలు, గొర్రెల పంపిణీ(Sheep Distribution Scheme)లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. గొర్రెల పంపిణీకి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. గొర్రెల అమ్మకందార్లకు ఇవ్వాల్సిన నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు గుర్తించి ఏసీబీ నలుగురు అధికారులను కూడా అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో విచారణ ముమ్మరం - మరో అధికారి ప్రమేయం గుర్తించిన ఏసీబీ
Telangana Sheep Distribution Scam :గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు గత నెలలో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ(ACB) పూర్తి తీగను లాగింది. రంగంలోకి దిగిన విచారణ బృందం మొత్తం 133 గొర్రెల యూనిట్లకు చెల్లించాల్సిన రూ.2.20 కోట్లు దారి మళ్లినట్లు అంచనా వేశారు.