CM Revanth Reddy Launched MSME Policy 2024 :ఒకప్పుడు కృష్ణా, గుంటూరులలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పదెకరాల భూమి కొనుక్కునే పరిస్థితి ఉండేదని, అదే ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే అదే జిల్లాల్లో 100 ఎకరాలు కొనొచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని శిల్పారామంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ రూపొందించిన ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు.
పాలసీ పనితీరును పర్యవేక్షించడం, వేగవంతం చేయడంలో భాగంగా ప్రపంచ బ్యాంక్ సహకారంతో రాష్ట్రంలో రూ.117 కోట్లతో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నేడు తెలంగాణలో భూముల విలువ గణనీయంగా పెరగాడనికి ప్రధాన కారణం యువత సిలికాన్ వ్యాలీని శాసించే స్థానికి సాంకేతిక నైపుణ్యంలో ఎదగడమే అని అన్నారు. ఆ సంపాదనతో భూములపై పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు.