తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కరెంటు కోత, తాగునీటి కొరత ఉండొద్దు - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశం - CM REVANTH on Water scarcity - CM REVANTH ON WATER SCARCITY

CM Revanth Review on Power, Drinking Water Supply : రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్, తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా, వెంటనే వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ కోతలు ఉండొద్దని, వేసవి అవసరాలకు తగినట్లుగా సరఫరా చేయాలని సీఎం స్పష్టం చేశారు. వేసవిలో తాగు నీటి అవసరాల కోసం గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలని, స్థానికంగా బోర్లు, బావులు, ఇతర వనరులను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణాల్లో వాటర్ ట్యాంకర్లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు.

CM Revanth Reddy on Summer
CM Revanth Review on Power, Drinking Water Supply

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 8:11 PM IST

Updated : Mar 30, 2024, 8:59 PM IST

CM Revanth Review on Power, Drinking Water Supply :వేసవిలో తాగు నీరు, విద్యుత్ సరఫరాపై అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగు నీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. వేసవిలో పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు సన్నద్ధంగా ఉండాలని సీఎం తెలిపారు. విద్యుత్ కోతలు (Power Cuts) ఉండొద్దని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

మే నెల రికార్డులు మార్చిలోనే నమోదవుతున్నాయి - రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం - power Consumption in Telangana

ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో సగటు విద్యుత్ లోడు 9,712 మెగావాట్లు కాగా, రెండు వారాలుగా 14,000 నుంచి 15,000 మెగావాట్ల డిమాండ్ ఉంటోందని సీఎంకు అధికారులు వివరించారు. ఏప్రిల్ రెండో వారం వరకూ దాదాపు ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని చెప్పారు. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరగ్గా, ఈ సంవత్సరం మూడు నెలల్లో రోజుకు సగటున 251 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరిగిందని అధికారులు తెలిపారు.

CM Revanth Review Meeting on Summer :గత ఏడాది మార్చి 14న 297 మిలియన్ యూనిట్ల సరఫరా అత్యధిక రికార్డు కాగా, ఈ ఏడాది 308 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదైందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్తు సరఫరా మెరుగుపడిందని చెప్పారు. గతేడాది కంటే ఈ సంవత్సరం అత్యధికంగా విద్యుత్తును సరఫరా(Power Supply Record) చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని సీఎం ఈ సందర్భంగా అన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలోనే డిమాండ్ గణనీయంగా పెరిగినప్పటికీ కోతలు లేకుండా విద్యుత్తు అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయన్న సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను(Deputy CM Bhatti Vikramarka), అధికారులను అభినందించారు. వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు.

వేసవిలో హైదరాబాద్​కు సరిపడా తాగు నీరు - నగరవాసులకు చల్లటి వార్త​ చెప్పిన జలమండలి - Drinking Water Crisis in Hyderabad

ట్యాంకర్లు బుక్ చేసిన 12 గంటల్లోపు చేరాలి : రాష్ట్రంలోని తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూన్ వరకు బోర్ వెల్స్, బావులు, స్థానికంగా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. తాగునీటి సరఫరాపై గ్రామాల వారీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

సమస్య ఉన్న చోట వెంటనే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారిగా నియమించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి కొరతను(WATER SCARCITY ) అధిగమించేందుకు తగినన్ని వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఎండల నుంచి ఉపశమనానికి ఫ్యాన్లు, ఏసీల వాడకం - భారీగా పెరుగుతోన్న విద్యుత్ వినియోగం

తాగునీటి ఎద్దడిపై అధికారుల ఫోకస్ - బోరుబావుల పునరుద్ధరణ - DRINKING WATER Crisis

Last Updated : Mar 30, 2024, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details