CM Revanth Reddy Gives Appointment Letters for Group-4 Winners : గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందనున్నాయి. వివిధ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన 8 వేల 143 మందికి నేడు పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వైద్యారోగ్య శాఖ ఎంపిక చేసిన 442 మంది అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణి ఉద్యోగాలు దక్కించుకున్న 593 మంది కూడా పత్రాలు అందుకోనున్నారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు : ఏడాది కాలంలో 54 వేల 520 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. టీజీపీఎస్సీ ద్వారా 12 వేల 324 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సర్కారు తెలిపింది. వైద్యారోగ్య నియామక బోర్డు 7 వేల 378, పోలీసు నియామక సంస్థ 16 వేల 67, గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 8 వేల 304 ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపింది. డీఎస్సీ ద్వారా 10 వేల 6 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించినట్లు వివరించింది. మరో 441 ఉద్యోగాలు ఇతర సంస్థల ద్వారా నియమించినట్లు వెల్లడించింది. గ్రూప్-4తో పాటు, సింగరేణి, వైద్యారోగ్య శాఖ ఉద్యోగ నియామక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన 9 వేల మందికి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. సాయంత్రం పెద్దపల్లిలో జరగనున్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలను అందుకోనున్నారు.
న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్ నగర అభివృద్ధి : సీఎం రేవంత్‌రెడ్డి