తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు - తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా సీఎం సూచనలు - CM Revanth Discuss on State Logo - CM REVANTH DISCUSS ON STATE LOGO

CM Revanth Reddy on Emblem of Telangana : రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఒకటి ఫైనల్ చేశారు. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

CM Revanth Reddy on Emblem of Telangana
CM Revanth Discuss on State Logo (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 3:37 PM IST

Updated : May 27, 2024, 5:08 PM IST

CM Revanth Discuss on State Logo : తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. రాజేశం బృందంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సుమారు 12 నమూనాలు రూపొందించగా, వాటిలో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని తుది మార్పులను సూచించారు.

గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించాలని సీఎం భావిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి.

CM Revanth Reddy on Emblem of Telangana :సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా రెండు నిమిషాలకు కవి అందెశ్రీ మార్పులు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కవి అందెశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. జూన్ 2న అధికార గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి రూపం కూడా కొలిక్కి వస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చిన రాష్ట్ర సర్కార్‌, టీఎస్ స్థానంలో టీజీని అమలు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అన్ని గవర్నమెంట్‌ ఆఫీస్‌లు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్త సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర అధికారిక కమ్యూనికేషన్‌లు కూడా టీఎస్‌కు బదులుగా రాష్ట్ర కోడ్‌ను టీజీగా మార్చాయి.

Telangana State Symbol Change Issue : లెటర్‌హెడ్‌ల నివేదికలు, నోటిఫికేషన్‌లు, అధికారిక వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ బయోస్ మొదలగు ఇతర అధికారిక వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ బయోస్‌లో టీజీగా ఉపయోగిస్తున్నారు. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చవద్దని పలువురు రాజకీయ నేతలు, మేధావులు కోరారు. చిహ్నం మార్పు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సరైంది కాదని ప్రతిపక్ష బీఆర్ఎస్‌ నిట్టూర్చింది.

కాకతీయ తోరణం, చార్మినార్​కు మించిన ప్రత్యామ్నాయం వేరేది ఏదైనా ఉందా అని ప్రశ్నించింది. వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన కాకతీయ రాజులు, ఓరుగల్లు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్ని అత్యంత అద్భుతంగా పాలించారని, చార్మినార్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ అని అలాంటి చిహ్నాన్ని మారుస్తాననడం సబబు కాదని గతంలో పేర్కొంది.

తెలంగాణ చిహ్నం మార్పు నిర్ణయంలో ఆంధ్రా వ్యక్తుల ప్రభావం : వినోద్ కుమార్

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్​ సిగ్నల్​ - TS Inauguration Day Celebrations

Last Updated : May 27, 2024, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details