ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినిమా చూసి వెళ్లిపోతే సరిపోయేది - హంగామా వల్లే ఇదంతా: రేవంత్‌రెడ్డి - CM REVANTH ON ALLU ARJUN INCIDENT

అల్లు అర్జున్‌ అరెస్టు ఘటనపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి - 'ఆజ్‌తక్‌' చర్చా కార్యక్రమంలో సీఎం కీలక వ్యాఖ్యలు

cm_revanth_on_allu_arjun_incident
cm_revanth_on_allu_arjun_incident (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2024, 10:43 PM IST

CM Revanth Reddy Responds to Allu Arjun Arrest Incident:అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చి ఎలాంటి హడావిడి చేయ్యకుండా కేవలం సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 'ఆజ్‌తక్‌' నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఎం పాల్గొని అల్లు అర్జున్‌ ఘటనపై మాట్లాడారు.

దేశంలో ఒక సాధారణ పౌరుడి దగ్గరి నుంచి ప్రధానమంత్రి వరకూ డా. బీఆర్ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుందని అన్నారు. 'పుష్ప2' విడుదల సందర్భంగా బెనిఫిట్‌ షోకి మాత్రమే కాకుండా టికెట్‌ ధరలు కూడా పెంచుకోవడానికీ అనుమతి ఇచ్చామని వెల్లడించారు. అయితే, ఆ బెనిఫిట్ షోకు ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్‌ అక్కడకు వచ్చారని ఈ క్రమంలో ఆయన్ని చూసేందుకు అభిమానులు బారీగా తరలి వచ్చారని అన్నారు.

సినిమా స్టారా లేక పొలిటికల్‌ స్టారా: ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి, థియేటర్‌, మేనేజ్‌మెంట్‌ వాళ్లను అరెస్ట్‌ చేశారని తెలిపారు. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హాజరుపరిచారని అన్నారు. అల్లు అర్జున్​కు కోర్టు బెయిల్‌ కూడా మంజూరు చేసింది కానీ కావాలని అతన్ని అరెస్టు చేశారని చర్చ మొదలు పెట్టారని అన్నారు. అతడు సినిమా స్టారా లేక పొలిటికల్‌ స్టారా అన్న విషయాన్ని తమ ప్రభుత్వం చూడదని నేరం ఎవరు చేశారన్న దాన్ని మాత్రమే చూస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

ఒకప్పుడు ఎర్రపండు రేంజే వేరు - కానీ ఇప్పుడు రైతన్నలకు కన్నీళ్లే!

ఇంట్లో కూర్చొని సినిమా చూడొచ్చుగా:అల్లు అర్జున్ అలా చేయడం వల్ల ఒక మహిళ చనిపోయిందని 9 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడని సీఎం అన్నారు. దీనికి బాధ్యులు ఎవరు, బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్ననించారు. అయినా జరిగిన ఘటనపై ఏ11 కింద ఆయనపై కేసు నమోదు చేశారని అన్నారు. ఆయన సినిమా చూడాలనుకుంటే స్టూడియోలో స్పెషల్‌ షో వేసుకునో లేక ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చని వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రేక్షకులు, అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకుంటే ముందుగా పోలీసులకు కానీ లేదంటే, మేనేజ్‌మెంట్‌కు కానీ సమాచారం ఇస్తే, వాళ్లు తగిన ఏర్పాట్లు చూసుకుంటారని అన్నారు. అలా కాకుండా చెప్పాపెట్టకుండా వస్తే ఉన్న కొద్దిమంది సిబ్బందితో వాళ్లు ఎలా సిద్ధం కాగలరని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

వారంతా నాకు బంధువులే: అల్లు అర్జున్‌ తనకు చిన్నప్పట్నుంచి తెలుసని కావాలని ఆయన్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తామని సీఎం అన్నారు. అల్లు అర్జున్‌ మేనమామ చిరంజీవి కాంగ్రెస్‌ నేత అని అంతే కాకుండా ఆయన సొంతమామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారు. ఇంక అల్లు అర్జున్‌ సతీమణి కుటుంబం తమకు బంధువులవుతారని తెలిపారు. పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ ప్రకారం చేయాల్సిన పని వాళ్లు చేస్తారని వ్యాఖ్యానించారు.

నాకు నేనే పెద్ద స్టార్‌ని:అల్లు అర్జున్‌ ఫిల్మ్‌ స్టార్‌ మాత్రమేనని సినిమాలు చేయడం ఆయన వ్యాపారమని సీఎం అన్నారు. వాళ్లు కేవలం డబ్బులు పెడతారు, సంపాదిస్తారు కానీ అందులో మీకు ఏమొస్తుంది, నాకేమొస్తుందని వ్యాఖ్యానించారు. ఇంక రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ చేసే వ్యక్తులు కూడా ఉన్నారని వాళ్లు ప్లాట్‌లు అమ్మి డబ్బులు సంపాదిస్తారని అన్నారు. అంతే కాని వాళ్లు ఈ దేశం కోసం భారత్‌-పాకిస్థాన్‌ బోర్డర్‌కు వెళ్లి ఏమైనా యుద్ధం చేస్తున్నారా అని అన్నారు. తనకు ఫేవరెట్‌ నటుడు కృష్ణ అని ఆయన ఇప్పుడు లేరని తెలిపారు. నాకు నేనే పెద్ద స్టార్‌ని నాకంటూ అభిమానులు ఉండాలి కానీ, నేనెవరికీ అభిమానిని కాదని సీఎ రేవంత్‌రెడ్డి చెప్పారు.

చంద్రబాబు మహా స్వాప్నికుడు - మరో పాతికేళ్లు రాజకీయ సుస్థిరత అవసరం : పవన్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్‌ నాంపల్లి కోర్టుకు తరలింపు

ABOUT THE AUTHOR

...view details