తెలంగాణ

telangana

ETV Bharat / state

యాపిల్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ - ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై చర్చలు - CM REVANTH AMERICA TOUR - CM REVANTH AMERICA TOUR

CM REVANTH AMERICA TOUR : అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం, ఇవాళ కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో యాపిల్ పార్కును సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మరోవైపు కాలిఫోర్నియాలో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్‌, తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్‌తో పిలుద్దామని కోరారు.

CM Revanth visit Apple Park
CM REVANTH AMERICA TOUR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 4:42 PM IST

Updated : Aug 9, 2024, 8:47 PM IST

CM Revanth visit Apple Park :సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమవేశాలు జరుపుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో యాపిల్ పార్కును సీఎం రేవంత్‌ బృందం సందర్శించింది. అనంతరం యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులను సీఎం వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఉపయోగపడేలా చర్చలు సానుకూలంగా జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్‌లైన్‌తో పిలుద్దాం : కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించిన సీఎం, అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందని సీఎం ప్రస్తావించారు.

న్యూయార్క్ స్టేట్‌ను అవుటాఫ్ మెనీ వన్, టెక్సాస్‌కు లోన్ స్టార్ స్టేట్, కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందన్నారు. భారత్‌లో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పటి నుంచి తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్‌తో పిలుద్దామని కోరారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో, తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్‌కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు.

నగరానికి మరో సంస్థ రాక :హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అమ్జేన్ సంస్థ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల్లో అంతర్జాతీయ బయోటెక్నాలజీ కంపెనీ అమ్జెన్(AMGEN) ఏర్పాటు చేయనున్న ఈ కొత్త సెంటర్‌లో సుమారు 3వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమ్జెన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. రాష్ట్రప్రభుత్వంలోని అవకాశాలను సదరు సంస్థకు వివరించారు.

అడోబ్ సీఈవోతో భేటీ :మరోవైపు ప్రఖ్యాత అడోబ్​ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్​ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్‌ను కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమవేశాల్లో పాల్గొన్నారు.

హైదరాబాద్​లో చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ సెంటర్ - సంస్థతో సీఎం రేవంత్​ ఒప్పందం

హైదరాబాద్​లో వివింట్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడులు - 1000 మందికి ఉద్యోగాలు - VIVINT PHARMA INVESTMENT IN HYD

Last Updated : Aug 9, 2024, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details