Political Leaders Pays Tribute to Lasya Nandita's death :లాస్య నందితను రోడ్డు ప్రమాదం కబళించడంపై పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యువ రాజకీయ నాయకురాలు లాస్య నందిత మృతిపై(Lasya Nandita Dead) గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు. లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth) నివాళి అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని లాస్య నివాసానికి వెళ్లిన సీఎం, ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న రేవంత్, ఆమె తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
లాస్య నందిత మృతి పట్ల సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అమాత్యులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Contonment BRS MLALasya Nandita Dead :లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. చిన్న వయసులో లాస్య అకాల మరణం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య మృతి పట్ల మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాసేవకు అంకితమైన యువ ఎమ్మెల్యే మృతి అత్యంత బాధాకరమన్న ఎమ్మెల్సీ కవిత, నందిత కుటుంబసభ్యులను ఓదార్చారు.
కబళించిన మృత్యువు - లాస్య నందితకు కలిసి రాని 'ఎమ్మెల్యే' కాలం