07:12 PM
సాంకేతిక నిపుణులతో చర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై మా నిర్ణయం చెప్తాం : సీఎం
సాంకేతిక నిపుణులతో చర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై తమ నిర్ణయం చెప్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్రమాలకు పాల్పడిన ఇంజినీర్లను తొలగించామన్నారు. కాళేశ్వరం అక్రమాలకు బాధ్యులపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. అవసరమైతే రెవెన్యూ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.
07:06 PM
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేం భావించాం : సీఎం రేవంత్‌రెడ్డి
మేడిగడ్డపై సీబీఐ కంటే ఉన్నతమైన విచారణను కోరామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై బీజేపీ నేతలకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను రక్షించాలని చూస్తున్నారని ఆరోపించారు. వరంగల్‌కు వచ్చిన కిషన్‌రెడ్డి మేడిగడ్డకు ఎందుకు రాలేదని నిలదీశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేం భావించామన్నారు.
07:03 PM
కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు తెలంగాణ ప్రజల నమ్మకం: సీఎం
కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు తెలంగాణ ప్రజల నమ్మకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు 4 కోట్ల ప్రజల ఆశలని ఆవేదన వ్యక్తం చేశారు.
06 :58 PM
మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ వైఖరిని స్పష్టంగా చెప్పాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం అందరికీ తెలిసిందేనని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతిని బీజేపీ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు.
06 :44 PM
కుర్చి పోగానే కేసీఆర్‌కు నీళ్లు, ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చాయి: రేవంత్‌రెడ్డి
కుర్చి పోగానే కేసీఆర్‌కు నీళ్లు, ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ శాసనసభకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కేసీఆర్ సర్కార్ అని విమర్శించారు. ప్రాజెక్టులను కేంద్రం నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ నిధులు కూడా ఇచ్చిందని ఆరోపించారు. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు కుంగితే చిన్న విషయంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
06 :39 PM
చావునోట్లో తలపెట్టానని కేసీఆర్ పదేపదే అంటున్నారు: రేవంత్
'చావునోట్లో తలపెట్టానని కేసీఆర్ పదేపదే అంటున్నారు. అలా అని భావించే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు పరిశీలించాలని భావించాం. ప్రతిపక్ష నేతలను మేడిగడ్డ వద్దకు కేసీఆర్ వెళ్లనివ్వలేదు. ఈసీ అనుమతి పొంది రాహుల్‌గాంధీ, నేను మేడిగడ్డను పరిశీలించాం. కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కప్పిపుచ్చారు. జరిగిన అవకతవకలపై సాగునీటిశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ చెప్పింది. రీడిజైన్ పేరుతో కాళేశ్వరం చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారు. తన బండారం బయటపడుతుందని కేసీఆర్ గ్రహించారు. తన అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో సభ పెట్టారు.'- సీఎం రేవంత్ రెడ్డి
06 :23 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేరవిచారణ జరిపిస్తాం : మంత్రి ఉత్తమ్
'కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది. మేడిగడ్డ బ్యారేజీకి రూ.4600 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల ముందు ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకున్నారు. ప్రాజెక్టు కుంగి 5 నెలలు గడుస్తున్నా మేడిగడ్డ గురించి కేసీఆర్ మాట్లాడలేదు. గతంలో మొత్తం ప్రాజెక్టు చీఫ్ డిజైనర్, నిర్మించిన వ్యక్తిని నేనే అని కేసీఆర్ గొప్పగా చెప్పుకున్నారు. కేసీఆర్ హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేరవిచారణ జరిపిస్తాం.'- మంత్రి ఉత్తమ్
06 :21 PM