ETV Bharat / state

మరీ ఇంతకు తెగించారా! - OLXలో ప్రభుత్వ భూముల అమ్మకం - అతి తక్కువ ధరకే! - TELANGANA GOVT LANDS IN OLX

ప్రభుత్వ భూములను ఓఎల్​ఎక్స్​లో అమ్మకానికి పెట్టిన భూ బకాసురులు - ఫొటోలు, సైట్​ వివరాలతో సహా ఓఎల్​ఎక్స్​లో అమ్మకాలు - కుత్బుల్లాపూర్​లో జరుగుతున్న భూకబ్జాపై బీజేపీ నేతల ఫిర్యాదు

Telangana Government Lands in OLX
Telangana Government Lands in OLX (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 10:53 AM IST

Telangana Government Lands in OLX : ప్రభుత్వ భూములను ఎవరైనా ఎలా అమ్ముతారు? వేలం వేస్తారు, లేదంటే బహిరంగంగా ప్రకటన ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే అమ్ముతుంది. కానీ OLXలో ప్రభుత్వ భూమి అమ్ముతామని పెడతారా? అసలు ప్రభుత్వ భూములను OLXలో అమ్మడం ఏంటి అనుకుంటున్నారా. ఇదంతా చూస్తే మీకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది కదూ! అసలు విషయం తెలిస్తే వామ్మో! మరీ ఇంతకు తెగించారా అనక మానరు. కొందరు భూ కబ్జాదారులు తక్కువ రేటుకే భూములు అంటూ ఈ కామర్స్​ సైట్ ​(OLX)లో ఫొటో, భూమి కొలతలు, జీపీఎస్​ ఫొటోలతో సహా ప్రకటన ఇచ్చారు. మీకు భూమి కావాలంటే ఈ కింది నంబర్​కు కాల్​ చేయమని బహిరంగంగానే భూమిని అమ్ముతున్నారు. భూ బకాసురుల ఈ వింత ప్రకటనకు చూసిన వారంతా భూములను ఇలా కూడా అమ్ముతారా అంటూ నోటిన వేలేసుకుంటున్నారు.

ఈ OLX ప్రకటనలు చూసిన బీజేపీ నేతలు షాక్​కు గురయ్యారు. అదేంటి ప్రభుత్వ భూమిని ఓఎల్​ఎక్స్​లో పెట్టడం ఏంటని వెంటనే పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసి అసలు విషయాలను బయటకు తీసుకొచ్చారు. ఈ మొత్తం తతంగం అంతా హైదరాబాద్​లోని కుత్బుల్లాపూర్​ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. హైదరాబాద్​ నగర శివారు ప్రాంతంలోని సర్వే నంబర్ 307 గాజుల రామారం, బాలయ్య బస్తీ పక్కన ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ భూమిని భూ బకాసురులు ఆక్రమించారు. రెవెన్యూ, మున్సిపల్​ అనుమతులు లేకుండా 477 ప్లాట్లుగా విభజించారు. ప్రభుత్వ భూమిని మట్టితో చదును చేస్తూ, పేద ప్రజలకు అమ్మడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కుత్బుల్లాపూర్​ డిప్యూటీ ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ప్రజలు మోసపోకుండా ప్రభుత్వ భూమిలో భద్రత కంచె వేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు.

OLXలో భూములు ఉంచి అమ్మకం : ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడే పనిలో ఉంటే, కొందరు కుత్బుల్లాపూర్​లో ల్యాండ్​ కబ్జాలు చేస్తున్నారని తెలిపారు. ఆ భూములను OLX యాప్​లో పెట్టి పేద ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఇదే 307 సర్వే నంబర్​లో ఆక్రమణలు కూల్చినా, మళ్లీ యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టడం అధికారుల అలసత్వానికి నిదర్శనం అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా OLXలో ఉంచి ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములు కాపాడాలని కోరారు. ఇలాంటి కబ్జాలకు కారకులైన వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.

కేయూ భూములను కబ్జా చేసిన సీఐ.. భవన నిర్మాణానికి ఏర్పాట్లు!

LAND GRAB: కోట్ల విలువైన ప్రభుత్వ భూములు.. ఆక్రమణలతో అన్యాక్రాంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.