Telangana Govt to Pay RS 500 Bonus Paddy : ఇప్పుడు వరి పండించే ఏ రైతు నోట విన్నా బోనస్ మాటే వినిపిస్తుంది. సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అందులోనూ కొన్ని రకాల ధాన్యాల పేర్లు చెప్పి, వాటినే సన్నాలుగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే అలాంటి విషయాలు ఏవీ రైతులకు తెలియడం లేదు. ఈ విషయాల్లో రైతులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు ఏ రకం వరికి బోనస్ ఇస్తారు? వాటి కోసం ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రంలో వర్షాకాలం వరి ధాన్యాన్ని పౌర సరఫరాల, సహకార, ఐకేపీ, మార్కెట్ కమిటీ అధికారులు ఇప్పటికే సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించనుంది. అయితే ఈ బోనస్‌ను కేవలం సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే బోనస్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సన్నాల్లోని 33 రకాలకు ఈ బోనస్‌ను వర్తింపజేశారు.
ధాన్యాన్ని కొలిచి : ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం గింజ పొడవు, వెడల్పు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మైక్రో మీటర్లను ఏర్పాటు చేశారు. పొడవు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ, వెడల్పు రెండు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కాకుండా ఉండాలి. ధాన్యం తేమ 17 శాతానికి మించనప్పుడు మాత్రమే కొనుగోలుకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీటికే రూ.500 బోనస్‌ను ఇవ్వనున్నారు.
బోనస్ వర్తించే వరి ధాన్యం రకాలు ఇవే :
- కంపసాగర్ వరి-1 (కేపీఎస్ 2874)
- సిద్ధి(డబ్ల్యుజీఎల్44)
- జగిత్యాల్ వరి- 3(జేజీఎల్ 27356)
- సాంబ మసూరి ( బీపీటీ 5204)
- జగిత్యాల్ వరి- 2(జేజీఎల్ 28545)
- వరంగల్ సన్నాలు (డబ్ల్యుజీఎల్32100)
- వరంగల్ సాంబ(డబ్ల్యుజీఎల్ 14)
- పొలాస ప్రభ (జేజీఎల్ 384)
- జగిత్యాల్ మసూరి (జేజీఎల్11470)
- తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048)
- మానేరు సోనా (జేజీల్ 3828)
- కృష్ణ (ఆర్‌ఎన్‌ఆర్ 2458)
- వరంగల్ వరి- 2 (డబ్ల్యుజీఎల్ 962)
- వరంగల్ వరి - 1119
- కూనరం వరి- 2 (కేఎన్‌ఎం 1638)
- ఎంటీయూ 1271
- కూనరం వరి- 1 (కేఎన్‌ఎం 733)
- రాజేంద్రనగర్ వరి - 4 (ఆర్‌ఎన్‌ఆర్ 21278)
- కరీంనగర్ సాంబ (జేజీఎల్ 3855)
- అంజన (జేజీఎల్ 11118)
- జగిత్యాల సాంబ (జేజీఎల్ 3844)
- జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798)
- సోమ్‌నాథ్ (డబ్ల్యుజీఎల్ 347)
- ఆన్‌ఆర్‌ఆర్ 31479(పీఆర్సీ)
- శోభిని (ఆర్‌ఎన్‌ఆర్ 2354)
- ప్రత్యుమ్న (జేజీఎల్ 17004)
- సుగంధ సాంబ (ఆర్‌ఎన్‌ఆర్ 2465)
- నెల్లూరు మసూరి (ఎన్‌ఎల్‌ఆర్ 34449)
- హెచ్‌ఎంటీ సోనా
- ఆన్‌ఆర్‌ఆర్ 31479(పీఆర్సీ)
- కేపీఎస్ 6251 (పీఆర్సీ)
- జేజీఎల్ 33124 (పీఆర్సీ)
- మార్టేరు మసూరి (ఎంటీయూ 1262)
- మార్టేరు సాంబ (ఎంటీయూ 1224)
రైతన్నకు సర్కారు డబుల్ బొనాంజా - సీఎం రేవంత్ దసరా కానుకలు ఇవే! - CM Revanth on Paddy