CM Jagan Participate in Puja at Visakha Sri Sarada Peetham:విశాఖ శారదా పీఠంలో శ్రీ రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయం జ్యోతి మండపంలో రాజ శ్యామల అమ్మవారి యాగంలో పాల్గొన్న సీఎం జగన్‌తో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పూర్ణాహుతి జరిపించారు. తాడేపల్లి నుండి విశాఖపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా శారదా పీఠం చేరుకున్నారు. మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని సంకల్పం చెప్పుకొన్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీఎం జగన్ విశాఖ పర్యటన - బస్టాప్ వద్ద ఉండొద్దని పోలీసుల హుకుం
యాగశాలలో రాజ్యశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్ సాంప్రదాయ దుస్తుల్లో అక్కడి దేవతామూర్తులను దర్శించుకొని, యాగంలో పాల్గొన్నారు. పీఠం ప్రాంగణంలోని దేవతా మూర్తుల ఆలయాలను సందర్శించారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సారథ్యంలో వేదపండితులు, ప్రధాన అర్చకులు సమక్షంలో పూజా క్రతువులు నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన యాగం,ఈ పూజలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్‌తో పాటు రాజ్య సభ సభ్యులు, వైసీపీ ఉత్తరాంధ్రా రీజనల్కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.