CM Jagan Mohan Reddy releases YSRCP Manifesto: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత జగన్ విడుదల చేశారు. కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఉన్న పథకాలనే కొనసాగిస్తాం.. అభివృద్ధి చేస్తాం అంటూ హామీ ఇచ్చారు. సామాజిక పింఛన్లు 3వేల 5 వందల రూపాయలు ఇస్తామని చెప్పినా, అది రెండు విడతల్లో పెంచుతామని చెప్పడం జనాలను ఆశ్చర్యపరిచింది.
9 ముఖ్యమైన హామీలతో.. రెండు పేజీల్లో సీపీ మేనిఫెస్టోను, ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. అమ్మఒడి సొమ్మును,15 వేల నుంచి 17 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అదే విధంగా వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, సున్నా వడ్డీ, వాహన మిత్ర పథకాలు కొనసాగిస్తామని వెల్లడించారు. మత్స్యకార భరోసా పథకం కొనసాగిస్తామని జగన్ మేనిఫెస్టోలో చెప్పారు. ఉచిత బీమా, పంటరుణాలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని, జిల్లాకు ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ పెడతామన్నారు. పూర్తిస్థాయిలో మేనిఫెస్టో వివరాలను నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని జగన్ చెప్పుకొచ్చారు.
జమిలి ఎన్నికలు, UCC, ఫ్రీ రేషన్- వికసిత భారతమే 'మోదీ గ్యారంటీ'- సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మేనిఫెస్టో - BJP Lok Sabha Election Manifesto
కోట్ల రూపాయలు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పిన జగన్ అభివృద్ధి చేశామని భరోసా ఇవ్వలేకపోయారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన వైఫల్యాన్ని పరోక్షంగా అంగీకరించారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ ఉంటాయని ఆయా వర్గాలు ఎంతో ఆశపడ్డాయి. తప్పుకుండా ఈ ప్రకటన ఉంటుందని వైసీపీ శ్రేణులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ జగన్ మాత్రం, అవేమీ లేకుండా ఊరించి ఉసూరుమనిపించారు.