ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం - పలు కీలక బిల్లులకు ఆమోదం - AP Cabinet Meeting Today - AP CABINET MEETING TODAY

AP Cabinet Meeting Today: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం ప్రారంభం అయ్యింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ అయ్యింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది.

AP Cabinet Meeting Today
AP Cabinet Meeting Today (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 10:32 AM IST

Updated : Jul 16, 2024, 12:33 PM IST

AP Cabinet Meeting Today :ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Otan Account Budget) కోసం ఆర్డినెన్స్ సహా వేర్వేరు అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం భేటీ అయ్యింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్​ రిపీల్ బిల్లుపై కూడా కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది.

ఏపీ మంత్రివర్గ సమావేశం (ETV Bharat)
ముగుస్తున్న ఒటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు :ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు సహా వివిధ అంశాలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటి అయ్యింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిపీల్ బిల్లు (Land Title Act Repeal Bill)కు కూడా మంత్రి వర్గంలో ఆమోదం తెలియజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ఒటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై నెలాఖరుతో ముగుస్తోంది. ఆగస్టు1 తేదీ నుంచి రెండు నెలల కాలానికి గాను బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది.
ఏపీ మంత్రివర్గ సమావేశం (ETV Bharat)

ఏపీ కేబినెట్​ కీలక నిర్ణయాలు - సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఆమోద ముద్ర - Andhra Pradesh Cabinet Meeting

చంద్రబాబు (ETV Bharat)

వివిధ అంశాల చర్చ : మరోవైపు గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి కూడా కేబినెట్​లో చర్చించనున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో నూతన ఇసుక విధాన రూపకల్పనపై కూడా కేబినెట్ చర్చించనుంది. మరో 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు భూకబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్​ (Land Grabbing Prevention Act)ను తీసుకువచ్చే అంశంపై కూడా కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది.

ఈ నెల 22 నుంచి శాసన సభ సమావేశాలు :అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా రాష్ట్ర కేబినెట్​లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 22 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాల పైనా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఏపీ మంత్రివర్గ సమావేశం (ETV Bharat)

సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం - కీలక అంశాలపై చర్చ! - AP Govt First Cabinet Meeting

కొలువుదీరిన క్యాబినెట్-​ చంద్రబాబుకు కుడి, ఎడమన ఆ ఇద్దరు! - ap cabinet meeting

Last Updated : Jul 16, 2024, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details