CM Chandrababu Meeting with Ministers and Secretaries: ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యల గురించి అధికారులు, సిబ్బంది ఓపిగ్గా వినాలని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సదస్సు జరిగింది. ఇందులో భాగంగా సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపైన సీఎం స్పందిస్తూ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రజలతో ప్రవర్తించే తీరు వల్ల చెడ్డ పేరు వస్తోందని సీఎం అన్నారు.
పింఛన్లు పంపిణీకి 2 రోజులు సమయం పెట్టుకున్నామని, అయితే పంపిణీలో కొంతమంది లబ్దిదారులతో దురుసుగా ప్రవర్తించడం, దబాయించడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వాటివల్ల మంచి చేస్తున్నా ప్రజల్లో చెడ్డపేరు వచ్చే అవకాశముందని అన్నారు. ముందు ప్రవర్తనలో మార్పు రావాలని సూచించారు. మనమందరం ప్రజలకు జావాబుదారీ అనేది గుర్తుంచుకోవాలని సీఎం తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామనే భావన అందరిలో ఉండాలని అన్నారు. అలా కాకుండా ఇక్కడ నాదే పెత్తనం అనే ధోరణితో ఉంటే సమస్యల పరిష్కరించే తీరే భిన్నంగా ఉంటుందన్నారు.
గిరిజనుల హక్కులు కాపాడతాం - 1/70 చట్టం తొలగించం: చంద్రబాబు
అధికారుల పనితీరుపై అంచనా: ప్రజలు తెచ్చే సమస్యల్లో కొన్ని పరిష్కరించేవి ఉంటాయి, కొన్ని పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అయితే వాటిన్నిటికంటే ముందు ముందు ప్రజలు మన వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, వారి సమస్యలను ఓపిగ్గా వినడం ప్రధానమని తెలిపారు. అధికారుల పనితీరు అంచనా వేయడంలో వారి ప్రవర్తన కూడా చాలా కీలకంగా ఉంటుందని, దీన్ని గుర్తుంచుకుని అందరూ పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తిని మదింపు వేయడానికి ఒక వినూత్న పద్దతిని అమలు చేస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో బిగ్ డేటా వచ్చాక ఏ అధికారి ఏ విధంగా పని చేస్తున్నారని, లోపాలు ఎక్కడున్నాయనేది ఒక అంచనా వస్తుందన్నారు.
ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలి: ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలని సీఎం అన్నారు. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని, ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను 6 నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు.
'కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ అరెస్టులపై జగన్ ఇప్పుడేమంటారు?'
పూర్తిస్థాయి బడ్జెట్‌పై సర్కార్ కసరత్తు - శాఖల వారీగా సమీక్షలు