CM Chandrababu Started Naredco Property Show:వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం విధ్వంసానికి గురైతే కూటమి ప్రభుత్వం మాత్రం 'బ్రాండ్ ఏపీ' నినాదంతో ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణంతో పాటు స్తిరాస్థి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని స్పష్టం చేశారు. టీడీఆర్ బాండ్ల అంశంలో మోసం జరిగిందన్న సీఎం, దానికి కారకులైన వారిని వదిలేది లేదని తేల్చిచెప్పారు.
వైఎస్సార్సీపీ సర్కారు నిర్మాణ రంగాన్ని నాశనం చేసిందని తాము అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి ప్రాధాన్యమిచ్చామని సీఎం తెలిపారు. 34 లక్షల మంది ఆధారపడిన నిర్మాణ రంగాన్ని ఏపీలో ప్రోత్సహించటం ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు మౌలిక వసతులు పెరుగుతాయని అన్నారు. ప్రధాని మోదీ విశాఖ వచ్చి 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి ముందుంటామని ఇందులో భాగంగానే ఉచిత ఇసుక విధానం తెచ్చామని వివరించారు.
తప్పు లేదంటే ఎలా? క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు: పవన్ కల్యాణ్
అక్రమ నిర్మాణాలను డ్రోన్ల ద్వారా గుర్తింపు: భవన నిర్మాణ నిబంధనల్ని సరళీకృతం చేసి స్తిరాస్థి రంగానికి ఊతమిచ్చేలా కొత్త జీవోలు ఇచ్చినట్లు సీఎం వివరించారు. అక్రమ నిర్మాణాలను డ్రోన్ల ద్వారా గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు. అమరావతిని ప్రపంచంలో అత్యున్న నగరంగా నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిర్మాణరంగ కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వటం ద్వారా వారి ఆదాయాన్ని 3 రెట్లు పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. గత పాలకులు అన్ని రంగాలనూ పతనావస్థకు తీసుకొచ్చారని రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని విమర్శించారు.
'బ్రాండ్ ఏపీ'తో ముందుకు - పడకేసిన నిర్మాణ రంగాన్ని నిలబెడతాం: సీఎం చంద్రబాబు (ETV Bharat) ప్రజలు తమని నమ్మి 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో పట్టం కట్టారు. దాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం పని చేస్తున్నాము. అలాగే ఎన్నడూ చూడని విధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలే భూ సమస్యలకు ముఖ్య కారణం. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వైఎస్సార్సీపీ నిర్వాకంతో చాలా మంది టీడీఆర్ బాండ్లు తీసుకుని నష్టపోయారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నాము. మేము వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశాం. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది మా ప్రభుత్వం లక్ష్యం. -చంద్రబాబు, సీఎం
తిరుపతి ఘటన - ఇద్దరు అధికారులు సస్పెన్షన్ - ఎస్పీ, జేఈవో బదిలీ
ఇంతమంది అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది?: పవన్ కల్యాణ్